Mark Antony: విశాల్, ఎస్ జె సూర్య నటించిన సినిమా ఓటిటిలో చూడొచ్చు, ఎక్కడ ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-10-11T14:15:37+05:30 IST

సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలైన 'మార్క్ ఆంటోనీ' సినిమా ఇప్పుడు ఓటిటి లో చూసేయవచ్చు. ఇందులో విశాల్, ఎస్ జె సూర్య ప్రధాన పాటల్లో కనపడగా, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే...

Mark Antony: విశాల్, ఎస్ జె సూర్య నటించిన సినిమా ఓటిటిలో చూడొచ్చు, ఎక్కడ ఎప్పుడంటే..
Mark Antony is all set to streaming on OTT

డబ్బింగ్ సినిమా 'మార్క్ ఆంథోనీ' #MarkAntony లో విశాల్ (Vishal), ఎస్ జె సూర్య (SJSuryah) నటించిన సంగతి తెలిసిందే. ఆధిక్ రవిచంద్రన్ (AdhikRavichandran) దీనికి దర్శకుడు. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా పట్టించుకోలేదు, అలాగే క్రిటిక్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్స్ లో విడుదలైంది, కానీ తెలుగులో మాత్రం అంతగా నడవలేదు. తమిళంలో మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి అని అంటున్నారు.

vishal-markantony.jpg

ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తోంది, ఇక మీ ఇంట్లోనే చూసుకోవచ్చు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అయిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (AmazonPrimeVideo) సొంతం చేసుకుంది. తన సాంఘీక మాధ్యమంలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారో కూడా అధికారికంగా ప్రకటిచింది. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సాంఘీక మాధ్యమంలో వెల్లడించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు అని చెప్పారు. ఈ సినిమా తొందరగానే ఓటిటి లో ప్రసారం చేసేస్తున్నారు అనే చెప్పాలి.

టైము ట్రావెల్ అంటే కాలంలో వెనక్కి వెళ్లి అక్కడ మనుషులను, సంఘటనలను మళ్ళీ ఎలా ప్రస్తుత కాలంలోకి తీసుకు రావచ్చు అనే నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో సెల్వ రాఘవన్ (SelvaRaghavan) కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాడు. అతనే ఈ టైము ట్రావెల్ అనే ఒక మెషిన్ కనిపెటే ప్రొఫెసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ (GVPrakashKumar) సంగీతం అందించారు. ఇందులో సునీల్ (Sunil) ఒక ప్రత్యేక పాత్రలో కనపడతాడు.

Updated Date - 2023-10-11T14:15:37+05:30 IST