Varun Tej: 'గాండీవధారి అర్జున' స్ట్రీమింగ్ ఎక్కడంటే...

ABN , First Publish Date - 2023-08-30T15:16:04+05:30 IST

వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా తొందరలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవనుందని తెలుస్తోంది, ఎక్కడ, ఎప్పుడు అంటే...

Varun Tej: 'గాండీవధారి అర్జున' స్ట్రీమింగ్ ఎక్కడంటే...
Varun Tej from Gandeevadhari Arjuna film

వరుణ్ తేజ్ (VarunTej) నటించిన 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjuna గత వారం విడుదలైంది. ప్రవీణ్ సత్తారు (PraveenSattaru) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడింది. మొదటి షో నుండే ఈ సినిమా కి నెగటివ్ టాక్ మొదలైంది, తరువాత ఈ సినిమాని ఎవరు అంతగా పట్టించుకోలేదు. వరుణ్ తేజ్ (VarunTej) ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇందులో సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయకురాలు, ఆమెకి ఇది రెండో సినిమా. మొదటి సినిమా 'ఏజెంట్' #Agent పెద్ద డిజాస్టర్ అయితే, తరువాత విడుదలైన ఈ సినిమా కూడా ఆమెకి ఇంకో డిజాస్టర్ అయింది.

gandeevadhariarjunareview1.jpg

ఇలా వరసగా రెండు డిజాస్టర్ లు అవటంతో, ఆమె కెరీర్ కొంచెం ఇబ్బందుల్లో పడినట్టే అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు కెరీర్ కూడా కొంచెం ట్రబుల్ లో పడింది అని అంటున్నారు. ఎందుకంటే అతను ఇంతకు ముందు నాగార్జున (AkkineniNagarjuna) తో చేసిన 'ది ఘోస్ట్' #TheGhost సినిమా కూడా పెద్ద డిజాస్టర్, తరువాత చేసిన ఈ సినిమా కూడా డిజాస్టర్, దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు కి ఇది కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.

ఇక ఈ 'గాండీవధారి అర్జున' సినిమా తొందరగానే ఓటిటి లో వచ్చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే థియేటర్స్ లో ఫెయిల్ అయిన సినిమాలు అన్నీ తొందరగానే ఓటిటి లో వచ్చేస్తూ ఉంటాయి, అందుకని ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' #Netflx లో చూసుకోవచ్చు. అయితే వచ్చే వారం ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Updated Date - 2023-08-30T15:16:04+05:30 IST