Theatre and OTT : ఈ వారం అలరించే సినిమాలివే!

ABN , First Publish Date - 2023-10-30T15:35:26+05:30 IST

దసరా రేసులో భారీ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో భగవంత్ కేసరి పండగ వాతావరణాన్ని రెట్టింపు ఉత్సాహంతో నింపింది. ఆ తర్వాత వారం అన్ని చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఈ శుక్రవారం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నవంబరు మొదటి వారంలోనూ చిన్న చిత్రాలే విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలేంటో చూసేయండి..

Theatre and OTT : ఈ వారం అలరించే సినిమాలివే!

దసరా రేసులో భారీ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 'భగవంత్ కేసరి' పండగ వాతావరణాన్ని రెట్టింపు ఉత్సాహంతో నింపింది. ఆ తర్వాత వారం అన్ని చిన్న చిత్రాలు విడుదలయ్యాయి. ఈ శుక్రవారం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నవంబరు మొదటి వారంలోనూ చిన్న చిత్రాలే విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలేంటో చూసేయండి.. (Theatre and OTT)

సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. (Maa vuri polemera) అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. కరోనా కారణంగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర2’ను తెరకెక్కించారు. మొదటి భాగానికి మించి థ్రిల్‌ను పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 3న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Polemera.jpg

వినోదాల ‘కీడా కోలా’. (Keeda kola)

దర్శకుడిగా వైవిధ్యమైన చిత్రాలు తీస్తూ, అప్పుడప్పుడూ నటుడిగా కూడా తెరపై మెరుస్తున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన కామెడీ సినిమా ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌ రాగ్‌మయూర్‌, రఘురామ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో విడుదల కానుంది.

Keeda.jpg

విధి ఏం చేసింది...(Vidhi)

ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రం విధి. రోహిత్‌ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్‌ రంగనాథన్‌, శ్రీనాథ్‌ రంగనాథన్‌ రచన దర్శకత్వంలో రూపొందించారు. నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ మీదుగా రంజిత్‌. ఎస్‌ నిర్మించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

కన్నడ శివరాజ్‌కుమార్‌ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని దర్శకుడు. సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది

host.avif

విక్రాంత్‌ మస్సే హీరోగా, విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే పేరుతో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీ సినిమాలు 

డిస్నీ+హాట్‌స్టార్‌

నవంబరు 2 - స్కంద  (తెలుగు)

నెట్‌ఫ్లిక్స్‌

లాక్‌డ్‌ ఇన్‌ (హాలీవుడ్‌) నవంబరు 1

జవాన్‌ (హిందీ) నవంబరు 2

అమెజాన్‌ ప్రైమ్‌

నవంబరు 3 - పి.ఐ. మీనా (హిందీ)

సోనీలివ్‌

నవంబరు 3 - స్కామ్‌ 2003: పార్ట్‌-2

ఆహా

అక్టోబరు 31 - ఆర్‌ యూ ఓకే బేబీ

Updated Date - 2023-10-30T15:42:17+05:30 IST