Dubbing Movies: ఈవారం ఓటీటీలోకి వచ్చిన.. తెలుగు డబ్బింగ్ చిత్రాలివే

ABN , First Publish Date - 2023-12-01T18:04:24+05:30 IST

ప్రతివారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అందులో చాలా వరకు తెలుగులో వచ్చేవి తక్కువగా ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే కొన్ని ఫ్లాట్ ఫాంలు కొన్ని సినిమాల‌ను, వెబ్‌సీరిస్ ల‌ను తెలుగులోకి అనువాదం చేసి విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన డ‌బ్బింగ్ సినిమాల స‌మాచారం ఇదే.

Dubbing Movies: ఈవారం ఓటీటీలోకి వచ్చిన.. తెలుగు డబ్బింగ్ చిత్రాలివే
dubbed movies

ప్రతివారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అందులో చాలా వరకు తెలుగులో వచ్చేవి తక్కువగా ఇతర భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే కొన్ని ఫ్లాట్ ఫాంలు కొన్ని సినిమాల‌ను, వెబ్‌సీరిస్ ల‌ను తెలుగులోకి అనువాదం చేసి విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఓటీటీలోకి వచ్చిన డ‌బ్బింగ్ సినిమాల స‌మాచారం ఇదే.

సన్నీడియోల్ క‌థానాయకుడిగా అనీల్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ‌ద‌ర్ 2 (Gadar 2) సినిమా ఆగ‌స్టు 11 న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌గా ఆక్టోబ‌ర్ నుంచి జీ5 (ZEE 5)లో హిందీలో స్ట్రీమ్ అవుతుండ‌గా తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువాదం చేసి ఈరోజు (డిసెంబ‌ర్ 1) స్ట్రీమింగ్‌కు తీసుకువ‌చ్చారు.

అదేవిధంగా క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్‌కుమార్ (Shiva Rajkumar) న‌టించిన తాజా చిత్రం ఘోష్ట్ (Ghost) ఆక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లోకి రాగా న‌వంబ‌ర్‌లో జీ5 (ZEE 5)లో క‌న్న‌డ భాష‌లో విడుద‌లైంది. ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

ది ఎంజెల్ మేక‌ర్ (The Angel Maker) అనే సైక‌లాజిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ బుక్ మై షో స్ట్రీమ్ ఓటీటీలో రెంట్ ప‌ద్ద‌తిలో తెలుగు ఇత‌ర భాష‌ల‌లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

హాలీవుడ్ స్టార్ హీరో ఎడ్డీ మ‌ర్ఫీ న‌టించిన క్యాండీ కేన్ లేన్ అనే అమెరిక‌న్ క్రిష్ట‌మ‌స్ కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో తెలుగు, ఇత‌ర భాష‌ల్లో ప్ర‌సారం అవుతున్న‌ది. అంతేకాకుండా స్మ‌గ్ల‌ర్ (Smugglers) అనే కొరియ‌న్ హైస్ట్ థ్రిల్ల‌ర్ తెలుగు, ఇత‌ర లాంగ్వేజేస్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.


బ్రాడీనూన్‌, ఎమ్మా మైర్ న‌టించిన హాలీవుడ్ కామెడీ, ఫ్యామిలీ చిత్రం ఫ్యామిలీ స్విచ్ (Family Switch) తెలుగు,ఇత‌ర భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది. అదేవిధంగా ఈక్వ‌లైజ‌ర్ 3 అనే హాలీవుడ్ యాక్ష‌న్ సినిమా హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.

ఇక మ‌ళ‌యాళ స్టార్ ఫ‌హాద్ పాజిల్‌, ఆప‌ర్ణ బాల‌ముర‌ళి న‌టించిన థ్రిల్ల‌ర్‌, డ్రామా దూమం యాపిల్‌లో మ‌ల్టీ ఆడియోస్‌తో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.హ‌రిస‌న్ ఫోర్డ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఇండియానా జోన్స్ సిరీస్‌కు ముగింపు ప‌లుకుతూ వ‌చ్చిన చివ‌రి భాగం ది డ‌య‌ల్ ఆఫ్ డెస్టినీ (Indiana Jones And The Dial Of Destiny) డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో మ‌ల్టీ లాంగ్వేజెస్‌లో ప్ర‌సారం అవుతున్న‌ది.

ఇక శ్రీలంక క్రికెట‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్‌గా వ‌చ్చిన 800 సినిమా తెలుగు, త‌మిళ ,మిందీ భాష‌ల్లో జియో సినిమా(Jio Cinema)లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

ఇటాలియ‌ర్ డిటెక్టివ్ క్రైమ్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ బ్లాంకా(Blanca S1 2021) ) సీజ‌న్ 1 అమెజాన్ మినీ టీవీ (amazon mini TV)లో తెలుగు, త‌హిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Updated Date - 2023-12-02T14:35:37+05:30 IST