సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RanaNaidu: వివాదాస్పద 'రానా నాయిడు' రెండో సీజన్ వచ్చేస్తోంది

ABN, First Publish Date - 2023-04-19T17:07:50+05:30

'రానా నాయుడు 2' రెండో సీజన్ వస్తోందని అధికారికంగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇందులో మొదటి సీజన్ లో కన్నా అన్నీ ఎక్కువే వుంటాయని అనుకుంటున్నారు...

Daggubati Venkatesh and Rana from Rana Naidu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈమధ్య కాలంలో ఏ వెబ్ సిరీస్ కి రానంత కాంట్రవర్సీ 'రానా నాయుడు' (#Rana Naidu) కి వచ్చింది. ఇందులో వెంకటేష్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) తండ్రీ కొడుకులుగా నటించగా, ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద విజయం సాధించింది అని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే ఇందులో బూతు ఎక్కువయిందని, చాలామంది రాజకీయ నాయకులూ అలాగే మామూలు జనాలు కూడా అన్నారు, కానీ ఈ వెబ్ సిరీస్ ని చూసినంతగా మరి దేనినీ చూడలేదని తెలిసింది.

అయితే ఈ వెబ్ సిరీస్ ఇంతటి విజయం అందుకుంది కాబట్టి, దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ ని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్ (Netflix). ఈ రెండో సీజన్ 'రానా నాయుడు 2' (Rana Naidu 2) లో మరిన్ని ట్విస్ట్స్, సస్పెన్స్ ఉంటుందని మొదటిదాని కన్నా ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా ఉండబోతోందని చెపుతోంది నెట్ ఫ్లిక్స్.

ఈ తెలుగు 'రానా నాయుడు' #RanaNaidu ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' (Ray Donovan) కి అనువాదం. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కూడా బాగా హిట్ అయింది. దానికన్నా ఎక్కువగా ఈ 'రానా నాయుడు' #RanaNaidu హిట్ అయినట్టుగా కనపడుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇంకా చాలా భాషల్లో ఈ 'రానా నాయుడు' ని తర్జుమా చేసి విడుదల చేశారు. ఇది నెట్ ఫ్లిక్స్ లోంచి తీసేసారు అని ఆమధ్య అన్నారు కానీ, తీయలేదు.

కరణ్ అన్షుమాన్, సుపర్న్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్ర పిళ్ళై తదితరులు నటించారు.

Updated Date - 2023-04-19T17:07:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!