OTT: ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’.. ఎందులో, ఎప్పటి నుంచంటే?

ABN , First Publish Date - 2023-11-29T14:13:48+05:30 IST

ప్రేక్ష‌కులను అలరించేందుకు మరో కొత్త సినిమా సిద్ధమైంది. న‌వంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుద‌లై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న కీడా కోలా సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయింది. తరుణ్ భాస్కర్, ప్రధాన పాత్రలో నటించడమే కాక నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించాడు.

OTT: ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’.. ఎందులో, ఎప్పటి నుంచంటే?
KEEDA COLA

ఓటీటీ ప్రేక్ష‌కులను అలరించేందుకు మరో కొత్త సినిమా సిద్ధమైంది. న‌వంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుద‌లై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న కీడా కోలా (keeda cola) సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయింది. చైతన్య రావు, బ్రహ్మానందం, తరుణ్ బాస్కర్, ప్రధాన పాత్రల్లో నటించగా తరుణ్ భాస్కరే నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించాడు.

క్రైం, కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బాగానే వర్కౌట్ అయినా ఎందుకనో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా స్థాయిలో జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లకు వరకు కలెక్ట్ చేసి పర్వాలేదనిపించింది. అయితే సినిమా విడుదలై 4 వారాలు కావస్తుండడంతో చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతున్నది.


డబ్బు అవసరం చాలా ఉన్న తాతా మనువడు ఓ షాప్ లో కీడా కోలా(keeda cola) అనే కూల్ డ్రింక్ కొనగా అందులో బొద్దింక వస్తుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలనే క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, ఓ గ్యాంగ్ స్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఎంట్రీతో వారి ఫ్లాన్ మారి కథ ఎలా మలుపులు తిరిగింది అనే తదితర సన్నివేశాలతో సినిమా రూపొందింది.

Updated Date - 2023-11-29T14:16:46+05:30 IST