ATM: ఓ వైపు న‌వ్విస్తూనే.. పిల్లీ ఎలుకా గేమ్‌లా ‘ఏటీఎం’

ABN , First Publish Date - 2023-01-07T22:24:57+05:30 IST

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar), స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు (Dil Raju) ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రాసిన క‌థ‌తో

ATM: ఓ వైపు న‌వ్విస్తూనే.. పిల్లీ ఎలుకా గేమ్‌లా ‘ఏటీఎం’
ATM Web Series Teaser Launch

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar), స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు (Dil Raju) ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్’ డైర‌క్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రాసిన క‌థ‌తో తెర‌కెక్కింది ATM వెబ్‌సీరీస్‌. బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ విన్న‌ర్ వీజే స‌న్నీ (VJ Sunny) కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్ర‌వేశిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ విడుదల చేశారు. దోపిడీ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ రాబోతున్నట్లుగా ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్ అవుతోంది. సి చంద్ర‌మోహ‌న్ (C Chandra Mohan) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వెబ్‌సీరీస్ (Web Series) ఇది. జీ5 (ZEE 5)‌ ఓటీటీలో జ‌న‌వ‌రి 20 నుంచి ఈ వెబ్‌సీరీస్‌ ప్ర‌సారం కానుంది.

ట్రైలర్ విడుదల అనంతరం హ‌రీష్ శంక‌ర్‌ మాట్లాడుతూ.. ‘‘దోపిడీ జోన‌ర్‌లో రాసే క‌థ‌ల్లో చాలా పొటెన్షియ‌ల్ ఉంటుంది. సెట్టింగ్ రియ‌లిస్టిక్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌లో దొంగ‌లు రొటీన్‌గా ఉండ‌రు. వాళ్ల‌ల్లో ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. వీజే స‌న్నీ కీ రోల్ చేశారు. స్ల‌మ్ లైఫ్ మీద అత‌నికున్న ఫ్ర‌స్ట్రేష‌న్ క‌నిపిస్తుంది. న‌వాబ్ త‌ర‌హా జీవితాన్ని కోరుకున్న అత‌ను ఏం చేశాడ‌నేది ఆస‌క్తిక‌రం. ఈ సిరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్ప‌ద‌ల‌చుకోలేదు. పిల్లీ ఎలుకా గేమ్‌లాగా ఉంటుంది. ఓ వైపు న‌వ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్ర‌య‌త్నం చేశాం’’ అని అన్నారు.

‘‘ప‌వ‌ర్ ఫుల్ ఫోర్సుల వ‌ల్ల కార్న‌ర్ అయిన న‌లుగురు చిన్న దొంగ‌ల రోల‌ర్ కోస్ట‌రే ఈ సిరీస్‌. ప్రాణాల‌తో బ‌తికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయ‌ల‌ను దోపిడీ చేయాల్సిన ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డిన వాళ్ల క‌థే ఇది. సుబ్బ‌రాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు’’ అని నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి (Harshith Reddy) తెలిపారు. కాగా, ప్ర‌శాంత్ ఆర్‌. విహారి (Prashanth R Vihari) ఈ సిరీస్‌కు సంగీతం స‌మ‌కూర్చారు.

Updated Date - 2023-01-07T22:24:59+05:30 IST