Bigg Boss Telugu 7: ఏమీ లేని దానిని పెద్దది చెయ్యమాకు నువ్వు, ఒసేయ్ పోవే అంటూ కోపంతో ఊగిపోయిన టేస్టీ తేజ

ABN , First Publish Date - 2023-10-25T18:41:22+05:30 IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో టేస్టీ తేజ వదిన భాష అసలు ఏమాత్రం బాగోలేదని అంటున్నారు నెటిజన్స్. అమ్మాయిని ఒసేయ్, పోవే అంటూ నానా మాటలు అన్న టేస్టీ తేజ ని శివాజీ 'అతి సర్వత్ర వర్జయేత్' అంటూ వేదాంతం మాటలు మాట్లాడి అనునయించాడు కానీ భాష సవరించమని తేజకి చెప్పలేదు

Bigg Boss Telugu 7: ఏమీ లేని దానిని పెద్దది చెయ్యమాకు నువ్వు, ఒసేయ్ పోవే అంటూ కోపంతో ఊగిపోయిన టేస్టీ తేజ
Tasty Teja

బిగ్ బాస్ తెలుగు 7 #BiggBossTelugu7 సీజన్ వారం వారం అరుపులు కేకలు ఎక్కువవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ క్యూబ్ పజిల్ టాస్క్ ఇస్తే అందులో గౌతమ్ (Gautham) విన్నర్ గా వచ్చాడు. ఇక టేస్టీ తేజ (Tasty Teja) అయితే కోపంతో ఊగిపోయాడు, అసలు పోవే, ఒసేయి అంటూ 'ఏమీ లేని దానిని పెద్దది చెయ్యమక్కు నువ్వు' అంటూ కోపంతో శోభా శెట్టి మీద అరుస్తున్నాడు. నేనేదో సరదాగా అంటే దానికి, దీనికి లింక్ పెట్టింది అంటూ శివాజీ (Sivaji) తో తేజ మొరపెట్టుకున్నాడు. 'అతి సర్వత్ర వర్జయేత్' అని శివాజీ ఎదో వేదాంతంగా మాట్లాడి ఏదైనా ఇలాగే ఉంటుంది అని చెప్పాడు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో 8మంది కంటెస్టెంట్స్ వున్నారు. అందులో శోభా శెట్టి (ShobhaShetty), భోలే షావలి, శివాజీ, అశ్వినీ, ప్రియాంక, అమర్ దీప్, సందీప్ (Sandeep), గౌతమ్‌లు ఉన్నారు. ఈసారి ఆట సందీప్, శోభాశెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నారేమో అనిపిస్తోంది. అలాగే శివాజీ ఈ వారం కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాడు అని ప్రేక్షకులు ఊహిస్తున్నారు.

biggbosstelugu4.jpg

ఇక అమర్‌దీప్, భోలే షావలి కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఈసారి హౌస్ నుండి ఎవరు బయటకి వెళతారో అని ప్రేక్షకులు కొంచెం ఈజీ గానీ ఊహించవచ్చు అని కూడా అంటున్నారు. ఆట సందీప్ ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకి వచ్చాడు, కానీ అతను ఈసారి సేవ్ అవ్వడం చాలా కష్టం అని తెలుస్తోంది. హౌస్ నుండి ఇంతవరకు ఏడుగురు బయటకి వెళ్లారు. రతిక (Rathika) బయటకి వెళ్లి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ తో లోపలికి వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.

Updated Date - 2023-10-25T18:41:22+05:30 IST