Tamannaah Bhatia: ముద్దు సీన్లు చెయ్యను అని, ఏకంగా ఇదేమి పని అని అడుగుతున్న నెటిజన్స్

ABN , First Publish Date - 2023-06-15T15:57:55+05:30 IST

అగ్ర నటి తమన్నా తన తాజా వెబ్ సిరీస్ 'జీ కర్దా' లో చేసిన శృంగార చేష్టలు గురించి ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందుకు వాళ్ళు ఏమి చేశారంటే...

Tamannaah Bhatia: ముద్దు సీన్లు చెయ్యను అని, ఏకంగా ఇదేమి పని అని అడుగుతున్న నెటిజన్స్
Tamannah Bhatia

అటు బాలీవుడ్ లోనూ, ఇటు దక్షిణాది భాషల్లోనూ బిజీగా వున్న నటి తమన్నా భాటియా (TamannahBhatia). ఆమె ఈమధ్య వార్తల్లో ఉంటూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం, తాను విజయ్ వర్మతో (VijayVarma) డేటింగ్ లో వున్నట్టుగా చెప్పి వార్తలకెక్కింది. ఆ తరువాత 'బాహుబలి' (Baahubali) సినిమాలో తన పాత్ర చాలా చిన్నదని, అందుకని తనకి అంతగా పేరు రాలేదని మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె 'జీ కర్దా' #JeeKarda అనే హిందీ వెబ్ సిరీస్ మొదటి సారిగా చేసింది. ఇందులో తమన్నా చాలా బోల్డ్ గా నటిచింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

tamannahbhatia1.jpg

ఇందులో తమన్నా చేసిన పాత్ర గురించి నెటిజన్స్ సాంఘీక మాధ్యమంలో ట్రోల్ చేస్తున్నారు. అసలు లిప్ లాక్ కూడా చెయ్యను అని చెప్పిన తమన్నా ఈ వెబ్ సిరీస్ లో అంతకన్నా ఎక్కువ శృంగార చేష్టలు చేసింది అని ట్రోల్ చేస్తున్నారు. ఇండియా లో ఇప్పుడు కొత్త సన్నీ లియోన్ (SunnyLeone) ఎవరంటే ఆమె తమన్నా అని ఇంకొకతను కామెంట్ పెట్టాడు. అటు క్రిటిక్స్, ఇటు నెటిజన్స్ కూడా తమన్నా చేసిన పాత్రని మెచ్చుకోవటం లేదు.

tamannahbhatia2.jpg

తమన్నా ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) తో 'భోళా శంకర్' (BholaaShankar) సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh) కూడా వుంది, కానీ ఆమె చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. అయితే తమన్నాని ఇలా శృంగార సన్నివేశాల్లో చూసిన ఆమె అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే సాంఘీక మాధ్యమంలో ఆమె వెబ్ సిరీస్ లో చేసిన ఆ శృంగార క్లిప్పింగ్స్ ని పోస్ట్ చేస్తూ, అసలు ముద్దే పెట్టాను అని ప్రకటించి, ఇప్పుడు ఇదేమి పని అని అడుగుతున్నారు.

Updated Date - 2023-06-21T18:42:37+05:30 IST