Hunt OTT streaming: త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హంట్’.. ఎప్పటినుంచంటే..

ABN , First Publish Date - 2023-01-31T13:28:24+05:30 IST

టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్స్‌లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. గత కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి.

Hunt OTT streaming: త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘హంట్’.. ఎప్పటినుంచంటే..
Hunt

టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యాక్టర్స్‌లో సుధీర్ బాబు (Sudheer Babu) ఒకరు. గత కొంతకాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. ఈ తరుణంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘హంట్’ (Hunt)విడుదల అయ్యింది. ఈ నటుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ జనవరి 26న రిలీజ్ అయ్యింది. అయితే.. మలయాళం మూవీ ‘ముంబై పోలీస్’ (Mumbai Police)కి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది.

అయితే.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ఇంతకుముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. ఆ సమయంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివరి కల్లా స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ భావించింది. అయితే, సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ తరుణంలో కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అమెజాన్ భావిస్తోందంట. అందుకే చిత్రబృందంతో మాట్లాడి.. స్ట్రీమింగ్ డేట్‌ని ఫిబ్రవరి 10కి మార్చిందట. దీని బట్టి మరో పది రోజుల్లో అంటే విడుదలైన 15 రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ కానుందన్నమాట. త్వరలోనే అధికారికంగా విడుదల తేదిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సినిమా పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్‌ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.

Updated Date - 2023-01-31T13:28:25+05:30 IST