సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Hunt OTT streaming: ఓటీటీలోకి వచ్చేసిన ‘హంట్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ABN, First Publish Date - 2023-02-10T13:37:05+05:30

టాలీవుడ్‌లో మంచి ప్రతిభ ఉన్న నటుల జాబితాలో సుధీర్ బాబు (Sudheer Babu) పేరు కచ్చితంగా ఉంటుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళుతున్నాడు.

Hunt
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో మంచి ప్రతిభ ఉన్న నటుల జాబితాలో సుధీర్ బాబు (Sudheer Babu) పేరు కచ్చితంగా ఉంటుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకెళుతున్నాడు. అయితే.. గత కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘హంట్’ (Hunt). సుధీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ జనవరి 26న విడుదలైంది. మలయాళం మూవీ ‘ముంబై పోలీస్’ (Mumbai Police)కి రిమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. దీంతో త్వరగా ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మూవీ టీం భావించింది. అందుకు తగ్గట్లే అప్పుడే ఓటీటీలో వచ్చేసింది.

‘హంట్’.. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ఇంతకుముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)తో పాటు ఆహా వీడియో (Aha Video) కలిసి దక్కించుకున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఫిబ్రవరి చివరి వారంలో స్ట్రీమింగ్ చేయాలని ఈ ఓటీటీలా యాజమాన్యాలు భావించాయి. అయితే, సినిమా ఫెయిల్యూర్‌గా నిలవడంతో కాస్తా త్వరగా నేటి (ఫిబ్రవరి 10) నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నాయి. సినిమా పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్‌ నటనకి మంచి ప్రశంసలు దక్కాయి.

Updated Date - 2023-02-10T13:37:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!