Master Chef India: తెలుగులోనూ సందడి చేయబోతోన్న ‘మాస్టర్ చెఫ్ ఇండియా’

ABN , First Publish Date - 2023-10-25T20:24:57+05:30 IST

సోనీ లివ్‌లో గ్రాండ్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ ఇండియా హిందీ రియాల్టీ షో ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి రాబోతోంది. మాస్టర్ చెఫ్ ఇండియా తమిళ, మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు అనే పేర్లతో ఈ షో తమిళ, తెలుగు భాషల్లోకి రాబోతోంది. తమిళ షోలో కౌశిక్ శంకర్, శ్రీయా అడ్కా, రాకేష్ రఘునాథన్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు షోలో చెఫ్ సంజయ్ తుమ్మా, నిఖిత ఉమేజ్, చెఫ్ చలపతి రావులు జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు.

Master Chef India: తెలుగులోనూ సందడి చేయబోతోన్న ‘మాస్టర్ చెఫ్ ఇండియా’
Master Chef India Team

సోనీ లివ్‌ (Sony LIV)లో గ్రాండ్ సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ ఇండియా హిందీ రియాల్టీ షో ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి రాబోతోంది. మాస్టర్ చెఫ్ ఇండియా తమిళ (Master Chef India Tamil), మాస్టర్ చెఫ్ ఇండియా తెలుగు (Master Chef India Telugu) అనే పేర్లతో ఈ షో తమిళ, తెలుగు భాషల్లోకి రాబోతోంది. తమిళ షోలో కౌశిక్ శంకర్, శ్రీయా అడ్కా, రాకేష్ రఘునాథన్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు షోలో చెఫ్ సంజయ్ తుమ్మా, నిఖిత ఉమేజ్, చెఫ్ చలపతి రావులు జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు. దక్షిణాది వారి అభిరుచికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాలను రూపొందించనున్నట్లుగా సోనీ లివ్ సంస్థ తెలిపింది.

ప్రతీ ప్రాంతానికి, భాషకు, రాష్ట్రానికి ప్రత్యేక సంప్రదాయం, ఆచారాలున్నాయి. వాటిని ప్రతిబింబించేలా ఈ షోను డిజైన్ చేశాం. కొత్తగా ప్రారంభిస్తోన్న ఈ కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహించాం. ఈసారి పోటీ దేశ వ్యాప్తంగా ఉన్న మాస్టర్ చెఫ్‌ల మధ్య ఉండబోతోంది. ఈ సారి షో మరింత రసవత్తరంగా ఉండబోతోంది. భారత దేశం భిన్న సంస్కృతులకు నిలయం. ఇండియాలో ప్రాంతీయ భాషల్లో మా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. అందులో భాగంగా తమిళ, తెలుగు భాషల్లో మాస్టర్ చెఫ్ ఇండియా షో రాబోతోంది. ఈ కార్యక్రమం వల్ల దక్షిణాది రుచుల్ని కూడా దేశానికి చూపించే అవకాశం కలుగుతుందని సోనీ లివ్ హెడ్ కంటెంట్ సౌగాట ముఖర్జీ (Saugata Mukherjee) అన్నారు. (Master Chef India)


సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఎస్ పీ ఎన్ ఐ)లో భాగమే ఈ సోనీ లీవ్ ఓటీటీ ఫ్లాట్ ఫాం. అన్ని రకాల డివైస్‌లో ఈ సోనీ లీవ్ అందుబాటులో ఉంది. ఎస్ పీ ఎన్ ఐలోని 27 ఏళ్ల కంటెంట్‌ను సోనీ లీవ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నలభై వేల గంటల ప్రోగ్రాంలు ఉన్నాయి. హాలీవుడ్ షోలు, టీవీ షోలు, లైవ్ టీవీలు ఇలా ఎన్నెన్నో సోనీ లీవ్ సబ్ స్క్రైబర్లకు అందుబాటులోనే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Venkatesh: పెళ్లిపీటలు ఎక్కబోతోన్న వెంకీ రెండో కుమార్తె.. కుర్రాడెవరో తెలుసా?

**********************************

*Bhagavanth Kesari: 100 కోట్ల క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల కలెక్షన్ల వివరాలివే..

***************************************

*Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!

**************************************

Updated Date - 2023-10-25T20:24:57+05:30 IST