కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Slum Dog Husband: కుక్కతో పెళ్లేంటి అని ఆశ్చర్యపోయే ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది, ఎక్కడంటే...

ABN, First Publish Date - 2023-08-23T14:24:56+05:30

ఈమధ్య ఓటిటి లోకి సినిమాలు తొందరగానే వచ్చేస్తున్నాయి. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమా రేపటి నుండి ఓటిటి లో ప్రసారం కానుంది. ఎక్కడ, ఎప్పుడు అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా...

Slum Dog Husband is going to stream on OTT from tomorrow

ప్రముఖ క్యారెక్టర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji), అతని కుమారుడు సంజయ్ రావ్ (SanjayRao) కథానాయకుడిగా నటించిన 'స్లమ్ డాగ్ హస్బెండ్' #SlumDogHusband సినిమా రేపటి నుండి ఓటిటి (OTT) లో ప్రసారంకానుంది. ప్రణవి మానుకొండ (PranaviManukonda) ఇందులో కథానాయకురాలు. బ్రహ్మాజీ, కమెడియన్ సప్తగిరి (Saptagiri) ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనపడతారు. ఈ సినిమా నేపధ్యం కథానాయకుడికి పెళ్లి చేసుకునే ముందు అతనికి వున్న గండం గట్టెక్కాలంటే ముందుగా ఒక కుక్కకి (Dog) ఇచ్చి పెళ్లి చెయ్యాలని జాతకం చూసి చెప్తారు.

అందుకోసం ఒక కుక్కని తెచ్చి దానికి పెళ్లి చేస్తారు, పెళ్లి కూడా ఇలా అలా కాదు, ధూమ్ ధామ్ గానే చేస్తారు. అయితే అక్కడే చిక్కు వచ్చి పడింది. ఆ తరువాత తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయినప్పుడు, ముందు కుక్కతో పెళ్లి అయింది కదా, దానికి విడాకులు ఇవ్వాలని షరతు పెడతాడు కుక్క యజమాని.

అప్పుడు కోర్టుకు ఎక్కుతారు అందరూ. కోర్టులో ఈ కేసు వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఈ కేసు ఏమైంది, ఎవరి పక్షాన తీర్పు వచ్చింది, కథానాయకుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా, కుక్క తో పెళ్లి నిజమైనదా, లేక అది చెల్లదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో (AmazonPrimeVideo) లో రేపటి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది, చూసెయ్యండి. (SlumdogHusband streaming on Amazon Prime Video from tomorrow)

ఈ సినిమాకి పూరి జగన్నాధ్ (PuriJagannadh) దగ్గర పని చేసిన ఏఆర్ శ్రీధర్ (ARSreedhar) అనే అతను దర్శకుడు. అప్పిరెడ్డి (AppiReddy) నిర్మాత.

Updated Date - 2023-08-23T14:24:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!