Skanda : ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే!

ABN , First Publish Date - 2023-10-22T16:28:04+05:30 IST

బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎనర్జీటిక్‌స్టార్‌ రామ్‌ (Ram potineni) హీరోగా నటించిన చిత్రం ‘స్కంద’. (Skanda) శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్లూని నిర్మించారు. గత నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది.

Skanda : ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే!

బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రామ్‌ (Ram potineni) హీరోగా నటించిన చిత్రం ‘స్కంద’. (Skanda) శ్రీలీల కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్లూని నిర్మించారు. గత నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ సందడి చేయడానికి సిద్దమైంది. ఈ నెల 27 నుంచి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్  కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వస్తోంది 

కథ:

పెళ్లిపీటలపై కూర్చున్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం కూతురిని... తెలంగాణ సీఎం అబ్బాయి వచ్చి తీసుకెళతాడు. దాంతో ఇద్దరి సీఎంల మధ్య వైరం మొదలవుతుంది. ఒకరినొకరు అంతం చేసుకునే వరకూ వెళుతుంది. తదుపరి ఆంధ్ర ముఖ్యమంత్రి ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతను మామూలోడు కాదు. ఎవ్వరినైనా ఎదిరించి అనుకున్నది సాధించేదాకా వదిలే రకం కాదు. ఆ యువకుడు కట్టుదిట్టమైన భద్రతను కాదని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లనీ కిడ్నాప్‌ చేసి రుద్రరాజపురం తీసుకెళ్లిన ఆ యువకుడు ఎవరు? ఇంతకీ ఆ ఊళ్లో ఎవరున్నారు? ఈ కిడ్నాప్‌లకీ క్రౌన్‌ గ్రూప్‌ కంపెనీస్‌ అధినేత రామకృష్ణంరాజు (శ్రీకాంత్‌)కీ మధ్య సంబంధం ఏంటి అన్నది మిగతా కథ.

Updated Date - 2023-10-22T16:28:37+05:30 IST