OTT: సిద్ధార్థ్ థ్రిల్లర్.. ‘చిన్నా’ ఓటీటీ విడుద‌ల తేదీ మార్పు! ఎప్పుడొస్తుందంటే

ABN , First Publish Date - 2023-11-21T11:14:09+05:30 IST

మొత్తానికి చిన్నా టీటీలోకి వచ్చేస్తున్నాడు. ల‌వ‌ర్‌బాయ్ సిద్ధార్థ్ హీరోగా ఫ్యామిలీ డ్రామా, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన చిన్నా చిత్రం గత వారం 17నే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో విడుదల అవుతుందని ప్రకటించి కొన్ని అనివార్య కారణాల వళ్ల వాయిదా వేశారు. తాజాగా సదరు ఓటీటీ సంస్థ మరోసారి చిన్నా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఎనౌన్స్ చేసింది.

OTT: సిద్ధార్థ్ థ్రిల్లర్.. ‘చిన్నా’ ఓటీటీ విడుద‌ల తేదీ మార్పు! ఎప్పుడొస్తుందంటే
chinna

మొత్తానికి చిన్నా టీటీలోకి వచ్చేస్తున్నాడు. ల‌వ‌ర్‌బాయ్ సిద్ధార్థ్ (Siddharth) హీరోగా ఫ్యామిలీ డ్రామా, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రూపొందిన చిత్తా (Chithha) ,చిన్నా (Chinna) చిత్రం గత వారం 17నే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో విడుదల అవుతుందని ప్రకటించి కొన్ని అనివార్య కారణాల వళ్ల వాయిదా వేశారు. తాజాగా సదరు ఓటీటీ సంస్థ మరోసారి చిన్నా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఎనౌన్స్ చేసింది. నవంబర్ 28 నుంచి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో సినిమా స్ట్రీమింగ్ జరుగనున్నట్లు ప్రకటించింది.

Chinna.jpg

సిద్ధార్థే స్వ‌యంగా నిర్మించి, నటించడమే కాక త‌నే అన్ని రాష్టాల‌లో తిరుగుతూ ప్ర‌మోష‌న్స్ సైతం చేశాడు. చిన్నా గ‌తంలో క‌మ‌ల్‌హ‌స‌న్ క‌ల్ట్ చిత్రం మ‌హ‌న‌ది సినిమా ఛాయ‌ల‌తో ఉందంటూ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా త‌మిళంలో 5 వారాల పాటు న‌డిచింది. బాబాయి, చిన్నారి అనే కూతురు మ‌ధ్య అనుబంధం, చిన్నారి కిడ్నాప్ ఇతివృత్తంలో రూ.4 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.16 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి మంచి విజ‌యం సాధించింది. త‌మిళ‌నాట క‌మ‌ల్‌హ‌స‌న్ వంటి స్టార్స్ ఈ సినిమాను చూసి ప్ర‌మోట్ చేయ‌డానికి స్వ‌యంగా ముందుకు రావ‌డం విశేషం.


ఈ సినిమాలో మ‌ళ‌యాళ న‌టి నిమిషా స‌జ‌య‌న్ క‌థానాయిక‌గా చేయ‌గా అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా విడుద‌లైన రోజు నుంచే అన్ని వ‌ర్గాల నుంచి సూప‌ర్ పాజిటివ్ టాక్‌తో కుటుంబ‌మంతా త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది. సిద్ధార్థ్‌ న‌ట జీవితంలోనే ఇది ఉత్త‌మ చిత్రం అంటూ విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకున్నారు. తప్పనిసరిగా జాతీయ అవార్డు సాధించే చిత్రంగా పేర్కొన్నారు.

chinna1.jpg

త‌మిళంలో సెప్టెంబ‌ర్ 28న‌ విడుద‌లైన ఈ సినిమా తెలుగులో ఆల‌స్యంగా ద‌స‌రా స‌మ‌యంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక్క‌డా చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ పెద్ద హీరోల‌ సినిమాలు విడుద‌ల నేప‌థ్యంలో తొల‌గించాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఈ సినిమా థియేట‌ర్ల‌లో మిస్ అయిన వారు డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ (Disney Hotstar) ఓటీటీ (OTT)లో చూడండి అంటూ సిద్ధార్థ్ సోష‌ల్‌మీడియాలో ఓ పోస్టు సైతం పెట్టారు. కానీ అనుకున్న సమయానికి కాకుండా ఈ చిత్రాన్ని ఈనెల 28న స్ట్రీమింగ్ కు తెచ్చారు. చూడాలి ఈ ‘చిన్నా’ కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు థ్రిల్ చేస్తుందో.

Updated Date - 2023-11-21T11:38:07+05:30 IST