Vedha: ఓటీటీలోకి వచ్చేసిన క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ సినిమా

ABN , First Publish Date - 2023-02-13T22:46:14+05:30 IST

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేద’ (Vedha). భ‌యం అంటే తెలియ‌ని వ్య‌క్తి క‌థాంశ‌మే

Vedha: ఓటీటీలోకి వచ్చేసిన క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ సినిమా
Shiva Rajkumar In Vedha Movie

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేద’ (Vedha). భ‌యం అంటే తెలియ‌ని వ్య‌క్తి క‌థాంశ‌మే ‘వేద’ సినిమా. ఇప్పటి వరకు ఆయ‌న న‌టించ‌న‌టువంటి ఔట్ అండ్ ఔట్ మాసీ పాత్ర‌లో ఈ సినిమాలో సంద‌డి చేశారు. అమ్మాయిలపై అకృత్యాలు చేసే మృగాళ్లను చ‌ట్టం ఏమీ చేయ‌లేనప్పుడు హీరో ఏం చేశాడు.. మ‌హిళ‌ల విష‌యంలో త‌ప్పు చేసే మ‌గ‌వాళ్లకు ఎలాంటి శిక్ష‌ల‌ను విధిస్తే స‌మాజంలో మార్పు వ‌స్తుంద‌నే విష‌యాన్ని ఇన్‌టెన్స్ కోణంలో ఈ సినిమాతో ఆవిష్క‌రించారు. ఇందులో హీరో శివ రాజ్‌కుమార్ పాత్ర మాత్ర‌మే కాదు.. సినిమాలోని మ‌హిళ‌ల పాత్ర‌లు కూడా ఆయ‌న‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. రీసెంట్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ చానెల్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. థియేటర్స్ కంటే జీ 5లో వేద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం విశేషం.

శివ రాజ్‌కుమార్‌ 125వ చిత్రం ‘వేద’. ఆయ‌న కెరీర్‌లోనే ఇది స్పెష‌ల్ మూవీ అని చెప్పొచ్చు. శివ రాజ్‌కుమార్‌తో పాటు లేడీస్ చేసిన అద్భుత‌మైన యాక్ష‌న్ సీన్స్ చూస్తే గూజ్‌బమ్స్ రావ‌టం ప‌క్కా. ఇంత‌కు ముందెన్న‌డూ రాని విధంగా, లేని విధంగా ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని శివ రాజ్‌కుమార్‌ భార్య గీతా శివ రాజ్‌కుమార్ (Geeta Shiva Rajkumar) నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అనే బ్యాన‌ర్‌పై రూపొందించారు. హ‌ర్ష ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అర్జున్ జ‌న్యా సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ చిత్రానికి స్వామి జె.గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. జాతీయ స్థాయిలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ఓటీటీ మాధ్యమంగా జీ 5 ఓ ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా జీ 5 సంస్థ లైబ్రరీలో ‘వేద’ సినిమా కూడా చేరింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుందని.. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మల‌యాళ‌, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని జీ5 వర్గాలు తెలియజేశాయి. (Vedha streams on ZEE5)

Updated Date - 2023-02-13T22:46:17+05:30 IST