Jawan OTT: ఓటీటీలోకి జ‌వాన్‌.. ఎప్ప‌టినుంచంటే!

ABN , First Publish Date - 2023-10-30T19:42:11+05:30 IST

చాలామంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై రికార్డులు సృష్టించిన జ‌వాన్ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర రైట్స్ ద‌క్కించు కోగా షారుఖ్ ఖాన్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 2న ఓటీటీలోకి తీసుకురానుంది.

Jawan OTT: ఓటీటీలోకి జ‌వాన్‌..  ఎప్ప‌టినుంచంటే!
jawan

చాలామంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. సెప్టెంబ‌ర్‌లో విడుద‌లై క‌లెక్ష‌న్ల రికార్డులు సృష్టించిన జ‌వాన్(Jawan Movie ) సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర రైట్స్ ద‌క్కించు కోగా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 2న ఓటీటీలోకి తీసుకురానుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే స‌ద‌రు సంస్థ షారుఖ్ బ‌ర్త్‌డే 4 డేస్‌ , త్రీ డేస్ అంటూ త‌న సోష‌ల్‌మీడియా ఎక్స్‌లో పోస్టు చేస్తూ వ‌స్తున్న‌ది. దీంతో అభిమానులు సినిమా కోసం చాలా అతృత‌గా ఎదురు చూస్తున్నారు.

srikjawan.jpg

ఈ యేడు దేశాన్ని ఊపేసిన వేయి కోట్లకు పైగా క‌లెక్ట్ చేసిన రెండు సినిమాలు షారుఖ్‌వే కావడం విశేషం. ఈయేడు ప్ర‌ధ‌మార్థం జ‌న‌వ‌రిలో ప‌ఠాన్(Pathaan) విడుద‌లై బాలీవుడ్‌కు ఊపిరిని తీసుకు రాగా, ద్వితీయార్థం సెప్టెంబ‌ర్‌లో త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన‌ జ‌వాన్ 1200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి బాద్ షా రేంజ్‌ను అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. సౌత్ స్టైల్ ఎలివేష‌న్స్‌, టేకింగ్ రుచిని నార్త్ వారికి చూయించ‌డ‌మే కాక‌ ఎన్న‌డులేని విధంగా సౌత్‌లోను ఈ సినిమా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఔరా అనిపించింది.

jawan-shahrukhkhan1.jpg

ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో ఓటీటీలోకి రానున్న ఈ చిత్రం నిడివి 3 గంట‌ల‌కు పైగానే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. థియేట‌ర్స్ కోసం 2.45నిమిషాల‌కు త‌గ్గించిన‌ నిడివిని ఇక్క‌డ అమాత్రం య‌ధావిధిగా ఉంచ‌నున్నారు. దీంతో ఫ్యాన్స్‌కు మ‌రింత ఎంజాయ్‌మెంట్ రానుంది.


షారుఖ్‌కు జోడీగా దీపికా ప‌దుకునే, న‌య‌న‌తార న‌టించిన ఈ చిత్రానికి త‌మిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి విల‌నిజం ప్ర‌ధాన పాత్ర‌ పోషించింది. అనిరుద్ అందించిన సంగీతం, పాట‌లు ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా ఇదే సంవ‌త్స‌రం షారుఖ్ ఖాన్ న‌టించిన మూడో చిత్రం డ‌న్‌కీ (Dunki) డిసెంబ‌ర్‌లో విడుద‌లకు సిద్ధ‌మైంది. దాని టీజ‌ర్‌ను కూడా ఆయ‌న జ‌న్మ‌దినం రోజే విడుద‌ల చేయ‌నున్నారు.

Updated Date - 2023-10-30T19:45:27+05:30 IST