Samantha: స‌మంత వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ వ‌చ్చేసింది! ఇది ఎంత ర‌చ్చవుద్దో

ABN , First Publish Date - 2023-12-07T18:30:48+05:30 IST

స‌మంత ఈపేరు తెలుగునాట తెలియ‌ని వారుండ‌రు. సినిమా హీరోయిన్‌గా ఎంత‌గా పేరు తెచ్చుకుందో అక్కినేని కోడ‌లిగా, ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో విడాకుల‌తో అంత‌క‌న్నా ఎక్కువ పేరే సంపాదించుకుంది. చివ‌ర‌గా ఖుషి సినిమాలో క‌నిపించిన ఆమె తాజాగా మ‌రో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

Samantha: స‌మంత వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ వ‌చ్చేసింది! ఇది ఎంత ర‌చ్చవుద్దో
samantha citadel

స‌మంత(Samantha) ఈపేరు తెలుగునాట తెలియ‌ని వారుండ‌రు. సినిమా హీరోగా ఎంత‌గా పేరు తెచ్చుకుందో అక్కినేని కోడ‌లిగా, ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో విడాకుల‌తో అంత‌క‌న్నా ఎక్కువ పేరే సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఆమె చేసిన సినిమాలు, త‌న డ్రెస్సింగ్‌, అనారోగ్యాల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ చ‌ర్చ‌లకు తావిస్తున్న‌ది. చివ‌ర‌గా ఖుషి సినిమాలో క‌నిపించిన ఆమె తాజాగా మ‌రో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది.

ది ఫ్యామిలీమెన్‌తో వెబ్ సిరీస్‌ల‌లోకి అడుగుపెట్టిన స‌మంత(Samantha) ఈసిరీస్‌లో బోల్డ్‌ సీన్లలో న‌టించి పెద్ద ర‌చ్చే చేసింది. నాగ చైత‌న్య‌తో విడాకుల‌ అనంత‌రం వ‌చ్చిన‌ పుష్ప సినిమాలో ఊ అంటావా అనే పాట‌లో రెచ్చిపోయి స్కిన్ షో చేసి పెద్దెత్తున ట్రోలింగ్ గురై నేష‌న‌ల్ లెవ‌ల్లో హ‌ట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. స‌మంత ఆ త‌ర్వాత అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో సినిమాల‌ను తగ్గించుకుంది. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే చిత్రాలను ఒప్పుకుంటున్న‌ది.


ఈ క్ర‌మంలో ఆమె చివ‌ర‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషి చిత్రంలో న‌టిస్తున్న క్ర‌మంలో సైన్ చేసిన సిటాడెల్ (Citadel) అనే వెబ్ సిరీస్ ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వ‌రుణ్ దావ‌న్‌(Varun Dhawan)తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇందులోనూ స‌మంత కొన్ని స‌న్నివేశాల‌లో కాస్త బోల్డ్‌గానే క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం.

హాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రా న‌టించిన‌ సిటాడెల్‌కు రిమేక్‌గా వ‌స్తున్న ఈ సిరీస్‌ను మ‌న దేశానికి అనుగుణంగా మార్పులు చేసి తెర‌కెక్కించారు. ఇక్క‌డ స‌మంత ఆ పాత్ర‌ను పోషించింది. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ను 2024 వేస‌విలో ఏఫ్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime) లో స్ట్రీమింగ్‌కు రానుంది.

Updated Date - 2023-12-07T18:41:20+05:30 IST