Samajavaragamana: ఈ హిట్ సినిమాని ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు, ఓటిటి లో ఎక్కడ, ఎప్పుడు అంటే...

ABN , First Publish Date - 2023-07-12T14:03:53+05:30 IST

'సామజవరగమన' అనే ఒక చిన్న సినిమా ఈమధ్య కాలంలో ఒక పెద్ద హిట్ అయిన సినిమా. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ఇందులో లీడ్ పెయిర్ గా వేస్తె, రామ్ అబ్బరాజు దీనికి దర్శకుడు. ఈ సినిమా త్వరలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది.

Samajavaragamana: ఈ హిట్ సినిమాని ఇక ఇంట్లోనే చూసుకోవచ్చు, ఓటిటి లో ఎక్కడ, ఎప్పుడు అంటే...
Samajavaragamana

శ్రీవిష్ణు (SreeVishnu), రెబా మోనికా జాన్ (RebaMonicaJohn) జంటగా నటించిన 'సామజవరగమన' #SamajavaragamanaFilmReview ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. రామ్ అబ్బరాజు దర్శకత్వం చేసిన ఈ సినిమా జూన్ 29న విడుదలైన సంగతి కూడా తెలిసిందే కదా. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ. 40 కోట్ల వరకు కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటే ఈ సినిమాకి పెట్టిన దానికన్నా మూడింతలు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. నిర్మాత అనిల్ సుంకరకి (AnilSunkara) 'ఏజెంట్' #Agent సినిమా విడుదల తరువాత ఇదే పెద్ద హిట్. ఈ సినిమాతో కొంచెం రిలీఫ్, అలాగే కొంత కోలుకున్నట్టు కనపడుతోంది.

Samajavaragamana.jpg

ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ఓటిటి (OTT) లోకి వచ్చేస్తోంది అని కూడా నాటున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా వున్నా కూడా ఓటిటి లో విడుదల చెయ్యాలని నిర్వాహకులు అనుకుంటున్నారు. అదీ కాకుండా ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా విడుదల చెయ్యడానికి ఓటిటి నిర్వాహకులు ఆలోచిస్తున్నారని తెలిసింది.

ఇంతకీ ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది అంటే, నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో జులై 22 (July22) నుండి చేస్తారని తెలిసింది. ఈ సినిమా ఓటిటి లో కూడా పెద్ద హిట్ అవొచ్చు అని భావిస్తున్నారు. ఎందుకంటే ఇదొక కామెడీ సినిమా, కుటుంబం అంతా కలిసి చూసుకోవచ్చు. ఈమధ్య ఓటిటి లో అడల్ట్ కంటెంట్ ఎక్కువయింది, అందుకని కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చొని టీవీ చూడలేకపోతున్నారు. ఈ 'సామజవరగమన' #Samajavaragamana సినిమా మాత్రం మంచి పాజిటివ్ టాక్ తో ఆల్రెడీ థియేటర్ లో హిట్ అయింది కాబట్టి, అందరూ చూస్తారు అని నిర్వాహకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-07-12T14:03:53+05:30 IST