RaoRamesh: వెబ్ సిరీస్ తో ఓటిటి లో మొదటిసారిగా ఎంటర్ అవుతున్న రావు రమేష్

ABN , First Publish Date - 2023-05-31T17:38:07+05:30 IST

వైవిధ్యమైన పాత్రలు చేసే రావు రమేష్ పెద్ద తెరమీద తన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తూ, నవ్విస్తూ ఉంటాడు. ఇప్పుడు బుల్లి తెర ప్రేక్షకులను కూడా మెప్పించాలని మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఓంకార్ దీనికి దర్శకుడు, నిర్మాత.

RaoRamesh: వెబ్ సిరీస్ తో ఓటిటి లో మొదటిసారిగా ఎంటర్ అవుతున్న రావు రమేష్
Rao Ramesh

రావు రమేష్ (RaoRamesh) ఒక వైవిధ్యమైన నటుడు. అతను ఏ సినిమాలో చేసినా, అది చిన్న పాత్ర, పెద్ద పాత్ర ఎటువంటిది అయినా, అతని పాత్ర ఆ సినిమాలో హైలైట్ అవుతుంది. అంతలా ప్రేక్షకులని తన నటనతో మెప్పిస్తాడు రావు రమేష్. ఒక సినిమాలో చేసిన పాత్ర ఇంకో సినిమాలో రాకుండా ఒక విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రావు రమేష్ ఇప్పుడు మొదటి సారిగా ఒక వెబ్ సిరీస్ లో నటించాడు. ఇది ఓటిటిలో త్వరలో ప్రసారం కానుంది అని తెలిసింది.

raoramesh1.jpg

ఈ వెబ్ సిరీస్ లో రావు రమేష్ తో పాటు, వరలక్ష్మీ శరత్ కుమార్ (VaralakshmiSarathKumar), సత్యరాజ్ (SathyaRaj) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ యాంకర్, దర్శకుడు ఓంకార్ (Omkar) దర్శకత్వం వహిస్తున్నాడు. అతనే నిర్మాత కూడా. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో విడుదల అవుతుంది అని తెలిసింది.

ఇది ఒక హారర్ థ్రిల్లర్ అని, ఇందులో ఆరు ఎపిసోడ్స్ వుంటాయని, ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కొక్కరి కథ ఉంటుందని తెలిసింది. అన్ని ఎపిసోడ్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కనపడుతుందని కూడా తెలిసింది. అలాగే ప్రముఖ గాయని, గీత మాధురి (GeethaMadhuri) భర్త నందు (Nandu) కూడా ఇందులో ఒక ప్రముఖ పాత్రలో కనపడనున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-05-31T17:38:07+05:30 IST