Skanda: హాట్‌స్టార్‌లో దుమ్ములేపుతున్న ‘స్కంద’.. కొత్త రికార్డు నమోదు

ABN , First Publish Date - 2023-11-09T20:57:54+05:30 IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీలీల, సాయి మంజ్రేకర్‌లు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘స్కంద’. నవంబర్ 2నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే 2023 సంవ‌త్స‌రంలో సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన‌ 24 గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది.

Skanda: హాట్‌స్టార్‌లో దుమ్ములేపుతున్న ‘స్కంద’.. కొత్త రికార్డు నమోదు
skanda

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీలీల, సాయి మంజ్రేకర్‌లు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘స్కంద’(Skanda). శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం నవంబర్ 2నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ హాట్‌స్టార్‌(Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే 2023 సంవ‌త్స‌రంలో సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన‌ 24 గంట‌ల్లోనే అత్య‌ధిక వ్యూస్ సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సాధించింది.

అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ న‌డుస్తున్న రంజుగా సాగుతున్న‌ స‌మ‌యంలో జ‌వాన్ లాంటి మ‌రో భారీ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ స్కంద‌ సినిమా స్ట్రీమింగ్ మొదలైన తొలిరోజు నుంచి నంబర్‌ వన్‌గా కొనసాగుతూ టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. గతంలోనూ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకి నాయక’, ‘వినయ విధేయ రామ’ సినిమాలు థియేటర్ల వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికీ డిజిటల్‌ మాధ్యమాలు, శాటిలైట్‌లో హయ్యస్ట్‌ టీఆర్పీలను సాధించగా, ఓటీటీలో వందల మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న రికార్డు ఆయనకే దక్కింది.


Skanda.jpg

ప్రస్తుతం ఫ్యామిలీలు థియేటర్లకి వెళ్లి సినిమా చూడటం తక్కువైన ఈ రోజుల్లో ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాను ఫైట్స్, పాటలు, డాన్స్, ఫ్యామిలీ డ్రామా అంటూ ప్రతి విభాగాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండ‌డంతో మిలియ‌న్ల వ్యూస్ వ‌స్తున్నాయి. అంతేగాక మ‌రికొంత మంది సినిమా క్లిప్స్ స్క్రీన్‌షాట్స్ తీసి సోష‌ల్‌మిడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా ‘స్కంద’ సినిమా ఇలానే కొన్నిరోజుల పాటు హాట్‌స్టార్‌లో టాప్‌రేటెడ్‌ మూవీగా నెంబర్‌ 1 పొజిషన్‌లో కొన‌సాగే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2023-11-09T22:25:37+05:30 IST