Adipurush: చాలా సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చిన ప్రభాస్ సినిమా

ABN , First Publish Date - 2023-08-14T17:56:50+05:30 IST

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద ట్రోల్స్, విమర్శలు చాలా వచ్చాయి. రచిత మనోజ్ ముంతషీర్ ఈ సినిమా గురించి ప్రజలకి క్షమాపణలు కూడా చెప్పాడు, ఇప్పుడు సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అంటే...

Adipurush: చాలా సైలెంట్ గా ఓటిటి లోకి వచ్చిన ప్రభాస్ సినిమా
Adipurush streaming on OTT

ఈమధ్య కాలంలో ఏ సినిమాకి రానన్ని ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమాకి వచ్చాయి. ఓం రౌత్ (OmRaut) దీనికి దర్శకుడు కాగా, మనోజ్ ముంతషీర్ (ManojMuthashir) మాటలు రాశారు. విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమా మీద విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. రామాయణం ఆధారంగా తీసిన ఈ 'ఆదిపురుష్' అసలు రామాయణాన్ని కించ పరిచే విధంగా వుంది అని సినిమా విడుదలైనప్పుడు నెటిజన్స్, ప్రేక్షకులు ఊగిపోయారు.

Adipurush-1.jpg

ఈ సినిమా అసలు ఎక్కడా రాకుండా నిషేదించాలని కూడా ప్రజలు కోర్టులను ఆశ్రయించారు. అలాహాబాద్ కి చెందిన కోర్టు ఈ సినిమా దర్శక, రచయితలని ఘాటుగా విమర్శించింది. అలాగే సెన్సార్ వాళ్ళని కూడా ఆలా ఎలా చూడకుండా వదిలేశారు అని అడిగింది న్యాయస్థానం. ఈ సినిమాలో అన్నీ తప్పుల తడకలే. రావణుడి వేషధారణ, అతని వాహనం, ఒకటేమిటి అన్నీ చాలా దారుణంగా చూపించారు ఇందులో. తరువాత ఈ సినిమా రచయిత మనోజ్ ముంతషీర్ ప్రజలకి క్షమాపణ చెప్పారు మన్నించమని.

అటు పూర్తి యానిమేషన్ కాకుండా, ఇటు మామూలు 2డి సన్నివేశాలు కూడా కొన్ని పెట్టి, మొత్తానికి ఈ సినిమాని ఒక కలగూర గంపగా చేసాడు దర్శకుడు ఓం రౌత్. సరే అతను దర్శకుడు, మరి ప్రభాస్ మాటేంటి, అతనికి తెలియదా, తెలిసి కూడా ఎలా చేసాడు అని కొందరు విమర్శించారు. ఇందులో రాముడికి మీసం వుంది, దానికి మీదా చాలా చర్చ జరిగింది. హనుమంతుడి మాటలు, అలాగే కొన్ని సన్నివేశాల్లో రామాయణంలో లేనివి కూడా చూపించడం, ఉదాహరణకు రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు, రాముడు చూసి వదిలేయటం లాంటివి.

Adipurush-1.jpg

ఇంత విమర్శలు వచ్చిన ఈ 'ఆదిపురుష్' సినిమా చాలా సైలెంట్ గా, ఎటువంటి ప్రచారాలు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో (AmazonPrimeVideo) స్ట్రీమింగ్ అవుతోంది. ఒక చిన్న సినిమా స్ట్రీమింగ్ అవుతోంది అంటే ఆ సినిమా నటీనటులు, లేదా సాంకేంతిక నిపుణులతో ఆ సినిమా పలానా ఓటిటి లో స్ట్రీమింగ్ అని ముందుగా చెప్పిస్తారు. ఇంత పెద్ద బడ్జెట్ సినిమా అయిన 'ఆదిపురుష్' గురించి ఒక్కరు కూడా ఆ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అని గాని, ఎప్పటి నుండి అని గాని ఒక ప్రచార చిత్రం ఏమీ లేకుండానే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేసేసారు. అయితే ఓటిటి లో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Updated Date - 2023-08-14T17:56:50+05:30 IST