Telugu horror thriller on DisneyPlusHotStar: ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ 'మాన్షన్ 24'

ABN , First Publish Date - 2023-10-04T18:17:42+05:30 IST

ఓంకార్ యాంకర్ గా టీవీ ప్రేక్షకులకు చాలా పరిచయం వున్న వ్యక్తి. అలాగే 'రాజుగారిగది' సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు 'మాన్షన్ 24' అనే హర్రర్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేసి ఓటిటి లో కూడా అడుగుపెడుతున్నారు ఓంకార్.

Telugu horror thriller on DisneyPlusHotStar: ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ 'మాన్షన్ 24'
OMkar, Varalakshmi Sarath Kumar, Anil Ravipudi and Ashwin Babu at the trailer launch of 'Mansion 24' web series

'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ (Omkar) ఈసారి 'మాన్షన్ 24' #Mansion24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ #DisneyPlusHotStar లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్(VaralakshmiSarathKumar), అవికా గోర్ (AvikaGor), బిందు మాధవి (BinduMadhavi), నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ (RaoRamesh) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఫంక్షన్ కి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi) వచ్చి ఈరోజు లాంచ్ చేశారు,

ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ, అతిథిగా వచ్చిన డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్స్. ఆయనతో 'పటాస్' సినిమా నుంచి పరిచయం వుంది అని చెప్పారు ఓంకార్. అప్పటి నుంచి ఒక్కో హిట్ అందుకుంటూ ఇవాళ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఎంత ఎదిగినా చిన్న సినిమాలకు, సిరీస్ లకు గెస్ట్ గా వస్తూ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన 'భగవంత్ కేసరి' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఓంకార్. వెబ్ సిరీస్ అంటే టీవీ ప్రోగ్రాంకు ఎక్కువ, సినిమాకు తక్కువ అనే ఇంప్రెషన్ ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.

omkar1.jpg

కొద్ది రోజుల్లోనే ఓటీటీ రీచ్ మరింత పెరుగుతుంది. అలాంటి రైట్ టైమ్ లో నేను 'మాన్షన్ 24' వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇస్తున్నా అనుకుంటున్నాను. వరలక్ష్మి గారు మనకు క్రాక్, వీరసింహారెడ్డిలో ఎంతో పవర్ ఫుల్ గా కనిపించారు. కానీ ఆమె పర్సనల్ గా సాఫ్ట్. ప్రాజెక్ట్ నచ్చితే ఎంతైనా ఇన్వాల్వ్ అయి సపోర్ట్ చేస్తారు. వరలక్ష్మి గారు ఉన్న బిజీలో సాయంత్రం 6 గంటలకు సెట్ నుంచి వెళ్లిపోవచ్చు. కానీ క్లైమాక్స్ టైమ్ లో రాత్రి 12, ఒంటిగంట వరకు వర్క్ చేశారు. నార్త్ తో చూస్తే మనకు తెలుగులో వెబ్ సిరీస్ లకు బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకే తక్కువ టైమ్ లో మంచి ఔట్ పుట్ కోసం ఫుల్ డేస్ వర్క్ చేశాం. ఉదయం 6 గంటల నుంచి షూట్ స్టార్ట్ చేసి మళ్లీ ఉదయం 6 గంటల వరకు షూటింగ్ చేసేవాళ్లం.

నాకు బలం నా తమ్ముళ్లు కల్యాణ్, అశ్విన్. వాళ్లు లేకుంటే నేను ఈ స్టేజీ మీద ఉండేవాడిని కాదేమో. ఈ వెబ్ సిరీస్ లోని ఆరు ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసేంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఒక హుక్ పాయింట్ తో ఎండ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. కోవిడ్ టైమ్ లో నేను టీవీ ప్రోగ్రామ్స్ పైనే దృష్టి పెట్టాను. కోవిడ్ లేకుంటే మరో సినిమా చేసేవాడిని. జానర్ మార్చి సినిమాలు చేయబోతున్నా. హారర్ జానర్ కాకుండా నేను చేయబోయే కొత్త సినిమా ఒకటి డిస్కషన్స్ లో ఉంది అని చెప్పారు ఓంకార్.

హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ అన్నయ్య ఓంకార్ తో వెబ్ సిరీస్ చేసే అవకాశం కల్పించిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కు బిగ్ థ్యాంక్స్. ఇవాళ అన్నయ్య ఓంకార్ బర్త్ డే. ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతున్నా. ఈ సిరీస్ ఒక ప్రొడ్యూసర్ గా కాదు ఆడియెన్ గా నాకు బాగా నచ్చింది. టీవీలో అన్నయ్యని ప్రేక్షకులు ఆదరించారు. అలాగే సినిమాల్లో 'రాజు గారి గది' మూవీస్ తో సక్సెస్ ఇచ్చారు. మాన్షన్ 24 వెబ్ సిరీస్ తో కూడా అన్నయ్య తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ, 'మాన్షన్ 24' సిరీస్ లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఓంకార్. ఈ వెబ్ సిరీస్ లో నటించడం హ్యాపీగా ఉంది. హారర్ థ్రిల్లర్ కథకు మంచి మ్యూజిక్ చాలా అవసరం. అలాంటి సౌండింగ్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, అలాగే ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో టైప్ ఆర్ట్ వర్క్ చేశారు అశోక్ గారు. డీవోపీ మనోజ్ నాకు చాలా కాలంగా పరిచయం. ఈ సిరీస్ కు బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ చూపించారు. డైరెక్టర్ ఓంకార్, డీవోపీ మనోజ్ పర్పెక్షనిస్టులు. ఫ్రేమ్ లో ఏ చిన్న తేడా ఉన్నా..ఆ సీన్ మళ్లీ చేస్తారు. ఇవాళ ఓంకార్ గారి బర్త్ డే. ఇలాంటి మంచి ట్రైలర్ ను ఆయన బర్త్ డే రోజున రిలీజ్ చేశాం. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. మాన్షన్ 24 పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Updated Date - 2023-10-04T18:17:42+05:30 IST