OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-02-01T09:37:51+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. జనవరి 31న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

మన్ కస్తూరి రే (Mann Kasturi Re)

మన్ కస్తూరి రే అనేది 2022లో మరాఠీ సస్పెన్స్ రొమాంటిక్ డ్రామా చిత్రం. సంకేత్ మనే దర్శకత్వం వహించిన చిత్రాన్ని ముంబై మూవీ స్టూడియోస్, ఐమెన్స్ డైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆర్ట్స్ ప్రొడక్షన్ నిర్మించారు. ఈ చిత్రంలో అభినయ్ బెర్డే, తేజస్వి ప్రకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

mann.jpg

పమేలా: ఏ లవ్ స్టోరీ (Pamela: A Love Story)

పమేలా అండర్సన్ అనే పాప్ సింగర్ జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఈ డాక్యుమెంటరీలో పమేలానే తన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను వివరిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

pamela.jpg

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

The Watchful Eye - ఇంగ్లిష్

Updated Date - 2023-02-01T09:37:53+05:30 IST