సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTTcontent: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-02-15T09:33:59+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. ఫిబ్రవరి 14న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

ఆల్ ది ప్లేసెస్ (All the Places)

ఆల్ ది ప్లేసెస్ అనేది పెడ్రో పాబ్లో ఇబార్రా దర్శకత్వం వహించిన మెక్సికన్ చలనచిత్రం. ఇందులో అనా సెరాడిల్లా, మారిసియో ఓచ్‌మన్ నటించారు. ఇద్దరు తోబుట్టువుల చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. ఈ తరుణంలో వారి మధ్య జరిగే సున్నితమైన సంఘటనలు చాలా కామెడీని సృష్టిస్తాయి. గతేడాది థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఏ సండే ఎఫైర్‌ (A Sunday Affair)

అ సండే ఎఫైర్ అనేది వాల్టర్ టేలౌర్ దర్శకత్వం వహించిన నైజీరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో డాకోర్ ఎగ్బుసన్, ఎన్సే ఇక్పే-ఎటిమ్, ఒరిస్ ఎర్హురో నటించారు. ఇద్దరు యువతులు, ఒక యువకుడు మధ్య జరిగే రొమాంటిక్‌ జర్నీ సరదాగా నవ్వుకునేలా చేస్తుంది. గతేడాది థియేటర్స్‌తో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

The Romantics - హిందీ

Jim Jefferies: High n' Dry - ఇంగ్లిష్‌

Perfect Match - ఇంగ్లిష్‌

In Love All Over Again - స్పానిష్‌

Re/Member - జపనీస్‌

లయన్స్ గేట్‌ (Lionsgate)

Minus One Season 2 - హిందీ

Updated Date - 2023-02-15T09:34:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!