OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-26T09:27:49+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా జనవరి 25న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

చార్మింగ్ ది హార్ట్స్ ఆఫ్ మెన్ (Charming the Hearts of Men)

చార్మింగ్ ది హార్ట్స్ ఆఫ్ మెన్ అనేది 2021 అమెరికన్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా చలనచిత్రం. ఎస్ఈ డేరోజ్ రచించి దర్శకత్వం వహించారు. కెల్సే గ్రామర్, అన్నా ఫ్రైల్, సీన్ ఆస్టిన్ కీలక పాత్రల్లో నటించారు. ఇది 1964లో పౌర హక్కుల ఉద్యమంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

charming.jpg

ది ప్రైస్ ఆఫ్ ఫ్యామిలీ (The Price of Family)

ది ప్రైస్ ఆఫ్ ఫ్యామిలీ అనేది గియోవన్నీ బోగ్నెట్టి దర్శకత్వం వహించిన 2022 ఇటాలియన్ కామెడీ చిత్రం. అలెగ్జాండ్రా లెక్లేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021 ఫ్రెంచ్ చిత్రం ప్రైస్ ఆఫ్ పేరెంటింగ్‌కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో క్రిస్టియన్ డి సికా, ఏంజెలా ఫినోచియారో, ధర్మ మాంగియా వుడ్స్, క్లాడియో కొలికా కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

family.jpg

డిస్ని ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Willow: Behind the Magic - ఇంగ్లిష్

Extraordinary - ఇంగ్లిష్

The Pupils - ఇటాలియన్

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Love Never Lies: Poland - పొలిష్

Against the Ropes - స్పానిష్

The Endless Night - పోర్చుగీస్

Updated Date - 2023-01-26T09:27:50+05:30 IST