సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-02-26T08:50:05+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా.. ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి..

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా.. ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌ ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. కరోనా తగ్గిన తర్వాత సైతం థియేటర్స్‌కి పోటీగా.. స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా ఫిబ్రవరి 25న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

మిస్సింగ్ (Missing)

గౌతమ్, శృతి కొత్తగా పెళ్లయిన జంట. ఒకరోజు రాత్రి షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా.. వారి వాహనానికి ప్రమాదం జరుగుతుంది. దాని తర్వాత గౌతమ్ రెండు రోజులకి కళ్లు తెరిచి చూస్తే హాస్పిటల్‌లో ఉంటాడు. అప్పుడే ప్రమాదం జరిగినప్పటి నుంచి తన భార్య కనిపించడం లేదని తెలుసుకుంటాడు. దాంతో గౌతమ్ తన స్నేహితులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మీనా సహాయంతో కనిపించకుండా పోయిన తన భార్య కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాశం. హర్ష నర్రా, నిక్కేషా, మిషా నారంగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫైర్ ఆఫ్ లవ్ (Fire of Love)

అగ్నిపర్వత శాస్త్రవేత్తలు కాటియా, మారిస్ క్రాఫ్ట్‌ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ చిత్రం ఫైర్ ఆఫ్ లవ్. 2022లో విడుదలైన డాక్యుమెంటరీ మూవీకి సారా దోసా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 20, 2022న 2022 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌‌గా నామినేట్ అయ్యింది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: OTT contnet: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

యూట్యూబ్ (YouTube)

A Box Of Cuban Cigars - బెంగాలీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney+ hotstar)

Ruins And Remains - హిందీ

Updated Date - 2023-02-26T08:50:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!