OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-02-20T09:05:34+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా ఫిబ్రవరి 19న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

విండర్సన్ నున్స్: ప్రీచింగ్ టు ది కోయిర్ (WHINDERSSON NUNES: PREACHING TO THE CHOIR)

విండర్సన్ నున్స్ సరి కొత్త ప్రదర్శన.. ‘ప్రీచింగ్ టు ది కోయిర్’. ఈ హాస్య నటుడి జీవితంలో జరిగిన పలు సంఘటనలు సరదాగా ఉంటూ.. మంచి కామెడీని సృష్టిస్తాయి. ఈ పోర్చుగీస్ స్టాండప్ కామెడీ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

winderson.jpg

కాత్ & కిమ్ (Kath & Kim)

కాత్ & కిమ్ అనేది అమెరికన్ టెలివిజన్ సిట్‌కామ్. అదే పేరుతో జేన్ టర్నర్, గినా రిలే రూపొందించిన ఆస్ట్రేలియన్ టెలివిజన్ సిరీస్ నుంచి ప్రేరణ పొంది ఈ వెబ్‌సిరీస్‌ని రూపొందించారు. మోలీ షానన్, సెల్మా బ్లెయిర్ కీలక పాత్రల్లో నటించారు. రెవిల్లే ప్రొడక్షన్స్, యూనివర్సల్ మీడియా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

kath-&-kim.jpg

Updated Date - 2023-02-20T09:05:35+05:30 IST