OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ABN , First Publish Date - 2023-02-16T09:25:54+05:30 IST
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా ఫిబ్రవరి 15న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..
మాలికపురం (Maalikapuram)
అయ్యప్ప మాల వేసిన బాలికలని మాలికపురం అని పిలుస్తారు. శన్ను అనే ఎనిమిదేళ్ల బాలికకి చిన్నప్పటి నుంచి అయ్యప్ప అంటే చాలా ఇష్టం. ఆమె నాన్న కూడా తనని శబరిమల తీసుకెళ్లాలి అనుకుంటాడు. కానీ అనుకోకుండా చనిపోతాడు. దీంతో తను అన్న అని పిలిచే బుజ్జి మరో కుర్రాడిని తీసుకొని శబరిమలకి బయలుదేరుతుంది. ఈ తరుణంలో ఓ రౌడీ ఆమెని కిడ్నాప్ చేయడానికి ప్రత్నిస్తుంటాడు. అప్పుడే అయ్యప్ప అనే ఓ మాల ధరించిన స్వామీ వచ్చి వారిని కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పోస్సేస్సేడ్ (Possessed)
పోస్సేస్సేడ్ లేక రాసుక్ అనేది 2022 విడుదలైన మలేషియా హార్రర్ చిత్రం. జేమ్స్ లీ దర్శకత్వం వహించగా.. ఆదిబ్ జైనీ కథని అందించాడు. ఈ చిత్రంలో నజ్మీగా అలీఫ్ సతార్, అడ్లీగా ఇక్మల్ అమ్రీ, వారిగా అబ్బాస్ మహమూద్, అలియాగా ఎలిస్యా సంధా, కెచిక్‌గా అయీ ఎల్హామ్, సామ్‌గా సియాజ్వాన్ రజాక్, నిక్‌గా అతిక్ అజ్మాన్, బెల్లా రహీమ్ నటించారు. కొన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి తనని, స్కూల్ ని, విద్యార్థులని కాపాడటానికి ఓ టీచర్ చేసే ప్రయత్నమే ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
The Real Housewives of Beverly Hills Season 6 - ఇంగ్లిష్
Cocomelon Season 7 - ఇంగ్లిష్
African Queens: Njinga - ఇంగ్లిష్
Full Swing- ఇంగ్లిష్
Red Rose - ఇంగ్లిష్
#NoFilter - పోర్చుగీస్
Eva Lasting - స్పానిష్
The Law According to Lidia Poët - ఇటాలియన్
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)
Ten Little Mistresses - ఇంగ్లిష్