సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTTcontent: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2023-02-17T09:52:04+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. కాగా.. ఫిబ్రవరి 16న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

సాధా నన్ను నడిపే (Sadha Nannu Nadipe)

సాధా నన్ను నడిపే అనేది 2022లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. అనారోగ్య కారణాల వల్ల ఓ యువతి చనిపోతుంది. ఈ తరుణంలో ఓ దొంగని లవ్ చేస్తుంది. లంకా ప్రతీక్ ప్రేమ్ కరణ్ రచించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్ధన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. నాగేంద్ర బాబు, ఆలీ సహాయక పాత్రలు పోషించారు. 24 జూన్ 2022న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

రాణా (raana)

రానా కాబోయే పోలీసు. డాక్యుమెంటేషన్ కోసం బెంగళూరుకి వెళతాడు. ఈ తరుణంలో ఓ హత్య కేసును సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో అతని ఎదురైన సమస్యలని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కన్నడ యాక్షన్ చిత్రంలో శ్రేయాస్ మంజు, రీష్మా నానయ్య ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహించాడు.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

The Upshaws Season 3 - ఇంగ్లిష్‌

Aggretsuko Season 5 - జపనీస్‌

OMG! (Oh My Girl) - థాయ్‌

The Womb - ఇండోనేషియన్‌

షామారో మీ (Shamaroo me)

Mrugtrushna - గుజరాతీ

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video)

Family Camp - ఇంగ్లిష్‌

Innocent Vengeance - ఇండోనేషియన్‌

జీ5 (Zee5)

Lost - హిందీ

మూబీ (Mubi)

Mutzenbacher - జర్మన్

Updated Date - 2023-02-17T09:52:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!