OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-23T08:30:55+05:30 IST

వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyam Vishnu Katha) టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశీ జంటగా నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. మార్చి 22న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

వినరో భాగ్యము విష్ణు కథ (Vinaro Bhagyam Vishnu Katha)

టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశీ జంటగా నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమయ్యాడు. జీఏ 2 పిక్చర్స్‌కు చెందిన బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రంలో.. మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించాడు.

విష్ణు తిరుపతిలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. బాల్యం నుంచి ఇతరులకి సహాయం చేస్తుంటాడు. మరోవైపు దర్శన యూట్యూబర్. దర్శన నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్‌తో విష్ణుకి, శర్మకి కాల్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తుంది. తరువాత, వారికి కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్రకథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

vinaro.jpg

పంచతంత్రం (Panchathantram)

పంచతంత్రం అనేది 2022లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. ఇది హర్ష పులిపాక కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించాడు. టిక్కెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్రఖని, నరేష్ అగత్స్య, శ్రీ విద్యా మహర్షి, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్యవాణి, దివ్యశ్రీపాద, వికాస్, ప్రణయ పి రావు, ఆదర్శ్ బాలకృష్ణ మరియు ఉత్తేజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 60 ఏళ్ల వయస్సులో తన ప్యాషన్‌ని ఫాలో అవుతూ.. ఓ వృద్ధుడు చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

panchatantram.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

We Lost Our Human - ఇంగ్లిష్

Waco: American Apocalypse - ఇంగ్లిష్

Close to Home: Murder in the Coalfield - ఇంగ్లిష్

The Kingdom Season 2 - స్పానిష్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

Pathaan - తెలుగు, తమిళం, హిందీ

Hunter - హిందీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

All That Breathes - ఇంగ్లిష్

జీ5 (Zee5)

Ike: Countdown to D-Day - ఇంగ్లిష్

The Man Who Would Be King - ఇంగ్లిష్

ఈటీవీ విన్ (ETV Win)

Lefto Righto - తెలుగు

Updated Date - 2023-03-23T08:32:08+05:30 IST