OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-01-25T09:06:43+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. జనవరి 24న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్ (Detective Knight: Independence)

ఎడ్వర్డ్ డ్రేక్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ యాక్షన్ చిత్రం ‘డిటెక్టివ్ నైట్: ఇండిపెండెన్స్’. ఈ మూవీ డిటెక్టివ్ నైట్ సిరీస్‌లో వచ్చిన ఈ మూడోది, చివరిది. డిటెక్టివ్ నైట్: రిడంప్షన్ (2022)కి కొనసాగింపుగా తెరకెక్కించారు. ఇందులో బ్రూస్ విల్లిస్, జాక్ కిల్మెర్, లోచ్లిన్ మున్రో, జిమ్మీ జీన్-లూయిస్, విల్లో షీల్డ్స్, డినా మేయర్, తిమోతీ నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

detective.jpg

హవేలీ ఇన్ ట్రబుల్ (Haveli In Trouble)

ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇండియాలోని హవేలీని అమ్మడానికి సిద్ధపడతాడు. దానికి తన స్నేహితులు రోమీ చౌదరి, లఖా సహాయం తీసుకుంటారు. అయితే ఆ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంటుంది. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి దానికి సంబంధించిన నిజానిజాలను బయటికి తీయడమే ‘హవేలీ ఇన్ ట్రబుల్’ కథాంశం. 6 జనవరి, 2023న థియేటర్స్‌లో విడుదలైన పంజాబీ చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి దేవి శర్మ దర్శకత్వం వహించగా.. గురుప్రీత్ భాంగు, సత్వాంత్ కౌర్, పల్విందర్ ధామి, లఖ్వీందర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అదర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

haveli.jpg

అదర్ (Other)

Laapta - పంజాబీ

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Black Sunshine Baby - హిందీ

Updated Date - 2023-01-25T09:06:45+05:30 IST