OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-01-22T11:23:35+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

The Post-Truth World (ది పోస్ట్-ట్రూత్ వరల్డ్)

ఐ-ఫు దర్శకత్వం వహించిన 2022 తైవానీస్ క్రైమ్ మిస్టరీ మూవీ ‘ది పోస్ట్-ట్రూత్ వరల్డ్’. జోసెఫ్ చాంగ్, ఎడ్వర్డ్ చెన్, కైట్లిన్ ఫాంగ్, అవిస్ ఝాంగ్, అంబర్ ఆన్ నటించారు. తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో మాజీ క్రీడాకారుడు చాంగ్ ఏడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఈ తరుణంలో ఓ రోజు జైలు నుండి గతంలో టాప్ మీడియా ప్రర్సనాలిటీ అయినా లియుని కిడ్నాప్ చేస్తాడు. అనంతరం చాంగ్ కేసుని మళ్లీ దర్యాప్తు చేయాలని లియు నిర్ణయించుకుంటాడు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Roomies In Dreamland Season 4 - హిందీ

Grind - ఇంగ్లిష్

LOL: Last One Laughing Nederland - డచ్

New Year’s Special - పోర్చుగీస్

Updated Date - 2023-01-22T11:24:05+05:30 IST