సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2023-01-17T10:02:21+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. జనవరి 16న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

డెవిల్స్ వర్క్‌షాప్ (Devil's Workshop)

క్లేటన్ అనే యువకుడు నటుడిగా కెరీర్‌ సెట్ చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నాల్లో చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఈ తరుణంలో అతనికి డేవిల్ లోర్‌లో నిపుణురాలైన ఎలిజాని కలుస్తాడు. ఆమె అతనికి రకరకాల పనులు చేయమని బలవంతం చేస్తుంది. దీంతో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ ‘డెవిల్స్ వర్క్‌షాప్’. ఈ మూవీ ప్రస్తుతం గూగుల్‌ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

సెక్షన్ 8 (Section 8)

సెక్షన్ 8 అనేది క్రిస్టియన్ సెస్మా దర్శకత్వం వహించిన 2022 అమెరికన్ యాక్షన్ చిత్రం. ర్యాన్ క్వాంటెన్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, స్కాట్ అడ్కిన్స్‌, డెర్మోట్ ముల్రోనీ, మిక్కీ రూర్కే కీలకపాత్రల్లో నటించారు. ఆఫ్గన్ యుద్ధం సమయంలో, తాలిబాన్‌లు మెరైన్ ప్లాటూన్ మెరుపుదాడి చేస్తారు. ఆ దాడి నుంచి ర్యాన్ క్వాటెన్, కెప్టెన్ మాసన్ మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అనంతరం అతను ఓ మెకానిక్ షాప్‌లో పని చేస్తుంటాడు. ఈ తరుణంలో అతనికి అక్కడి గ్యాంగ్‌స్టర్లతో గొడవ అవుతుంది. ఆ గ్యాంగ్‌స్టర్ల ముఠాని అతను ఎలా ఎదుర్కొన్నాడనేది ‘సెక్షన్ 8’ కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం గూగుల్‌ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - 2023-01-17T10:02:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!