Annapoorani OTT: ఓటీటీలోకి.. న‌య‌న‌తార‌ వివాదాస్పద చిత్రం

ABN , Publish Date - Dec 25 , 2023 | 04:05 PM

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించిన అన్న‌పూరణి సినిమా రిలీజై నెల కూడా పూర్తి కాకుండానే డిజిట‌ల్ స్ట్రిమింగ్‌కు సిద్ధ‌మైంది. డిసెంబర్ 1న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్ష‌కాధ‌ర‌ణ‌ పొందింది.

Annapoorani OTT:  ఓటీటీలోకి.. న‌య‌న‌తార‌ వివాదాస్పద చిత్రం
annapoorni

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార (Nayanthara) న‌టించిన అన్న‌పూరణి (Annapoorani) సినిమా రిలీజై నెల కూడా పూర్తి కాకుండానే డిజిట‌ల్ స్ట్రిమింగ్‌కు సిద్ధ‌మైంది. డిసెంబర్ 1న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్ష‌కాధ‌ర‌ణ‌ పొందింది. జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, ప్రధాన పాత్రల్లో నటించ‌గా త‌య‌న్ సంగీతం అందించారు. జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ నిర్మాత‌లు కాగా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

సౌత్ ఇండియాలో న‌య‌న‌తార‌కు ఉన్న పాపులారిటీ త‌మిళ‌నాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌కు సుప‌రిచ‌త‌మే. హీరోల పేరుతోనే సినిమాలు న‌డిచే సౌత్‌లో లేడి ఓరియంటెడ్ సినిమాల‌తో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న ఏకైక న‌టి ఆమె. తెలుగులో అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సినిమాలు చేస్తూ వ‌స్తున్న‌ న‌య‌న‌తార త‌ర‌చూ త‌నే ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన అనేక త‌మిళ సినిమాలు తెలుగు నాట డ‌బ్ అయి విశేషంగా పేరును తీసుకువ‌చ్చాయి. ముఖ్యంగా అమ్మోరు త‌ల్లి, నెట్రిక‌న్‌, ఐరా, O2 వంటి సినిమాలు ఓటీటీలు వ‌చ్చాక న‌య‌న్ రేంజ్ అమాంతం స్టార్ హీరో రేంజ్‌లో పెరిగిందంటే అతిశ‌యోక్తి లేదు.


గ‌త నెల‌లో ఓటీటీలో హిందీ సినిమా జ‌వాన్‌, త‌మిళ సినిమా గాడ్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న‌ న‌య‌నతార (Nayanthara) ఇప్పుడు త‌న 75 వ చిత్రం అన్న‌పూరణి (Annapoorani) సినిమాతో మ‌రోసారి ఓటీటీ అభిమానుల‌ను అల‌రించ‌డానికి రెడీ అయింది. ఈ సినిమా ఈనెల 29 (డిసెంబ‌ర్ 29) నుంచి నెట్ ఫ్లిక్స్‌లో త‌మిళంత పాటు తెలుగు, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగ‌నుంది. అయితే ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల అయిన‌ప్ప‌టి నుంచి వివాదాల్లోనే ఉంటూ వ‌చ్చింది. ఇందులో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా అంశాలు ఉన్నాయని, సినిమాను మొత్తానికే బ్యాన్ చేయాలంటూ సదరు కుల సంఘాలు ఆరోపించాయి.

ఓ బ్రాహ్మ‌ణ యువ‌తి నాన్‌వెజ్ హోట‌ల్ పెట్టాల‌ని క‌ల‌లు క‌న‌డం ఈ క్ర‌మంలో జ‌రిగే స‌న్న‌వేశాల నేప‌థ్యంలో సినిమాను ఆధ్యంతం కామెడీ, ఎమోష‌న‌ల్‌గా రూపొందించారు. కాగా దేవుడికి ప్ర‌సాదం అందించే ఓ బ్రాహ్మణ వ్య‌క్తి కూతురు.. మాంసంతో వంట‌లు చేస్తుంద‌ని బ‌య‌ట తెలిస్తే భ‌క్తులు, స‌మాజం ఏమ‌నుకుంటుందో అంటూ తండ్రి చెప్పే డైలాగ్ పై త‌మిళ‌నాట పెద్ద ఎత్తున‌ దుమారం చెల‌రేగింది. ఈక్ర‌మంలో కోర్టులో కేసులు, బెదిరింపులు బాగానే వ‌చ్చాయి. చివ‌ర‌కు ఆ డైలాగ్స్ క‌ట్ చేసి అన్న‌పూరణి (Annapoorani) సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. మ‌రి ఇప్పుడు ఈ డైలాగులు ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఉంటాయా ఉండ‌వా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 25 , 2023 | 04:05 PM