Malli Pelli: మళ్ళీ వివాదంలో నరేష్, పవిత్రల పెళ్లి

ABN , First Publish Date - 2023-06-23T18:35:13+05:30 IST

నరేష్, పవిత్ర, మళ్ళీ పెళ్లి అన్నీ మళ్ళీ వార్తల్లో వున్నాయి. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఈ 'మళ్ళీ పెళ్లి' మీద కోర్టుకు వెళ్లారని, లీగల్ నోటీసులు కూడా ఇచ్చారని వార్తలు వైరల్ అవుతున్నాయి

Malli Pelli: మళ్ళీ వివాదంలో నరేష్, పవిత్రల పెళ్లి
Naresh and Pavitra

సీనియర్ నటుడు నరేష్(VKNaresh), పవిత్రల (PavitraLokesh) 'మళ్ళీపెళ్లి' #MallePelli వివాదం ఇంకా సమసిపోలేనట్టుంది, ఇంకా ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కథ రెండేళ్ల క్రితమో, మూడేళ్ళ క్రితమో మొదలయ్యింది. అప్పుడెప్పుడో నరేష్, పవిత్రలు బెంగుళూరు హోటల్ లో పట్టుబడ్డారు అనే వార్త వైరల్ అవటం, ఆ తరువాత నరేష్, పవిత్రల మధ్య వారి అనుబంధాన్ని పబ్లిక్ గా అందరికీ తెలియటం ఇలా వాళ్లిద్దరూ వార్తల్లో ఉంటూనే వున్నారు.

ఆ తరువాత నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి (RamyaRaghupathi) కోర్టుకు వెళ్లడం కూడా పెద్దగా వైరల్ అయింది. వాళ్లిద్దరూ ఒకరితో ఒకరు పోటీగా టీవీల్లో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, వార్తల్లో ఉంటూనే వున్నారు. ఆ తరువాత నరేష్ తన ట్విట్టర్ లో ఒక మంచి శుభవార్త చెపుతా అనటం, తనకి పవిత్రకి పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలు విడుదల చెయ్యడం వలన మళ్ళీ వార్తల్లో వున్నారు.

Naresh-VK.jpg

ఇలా ఉంటూనే 'మళ్ళీపెళ్లి' అనే సినిమా వస్తోంది అని చెప్పడంతో ఆ కథ నరేష్, రమ్య రఘుపతి, పవిత్ర ల మధ్య జరిగే యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వార్తలు రావటంతో మళ్ళీ వివాదాల్లో వున్నారు. ఇలా 'మళ్ళీపెళ్లి' సినిమాకి బాగా ప్రచారం కూడా అయినట్టయింది. ఈ సినిమా ప్రచార చిత్రాలు మిలియన్ల కొద్దీ చూసారు, సినిమా కూడా అలాగే చూస్తారు అని అందరూ అనుకున్నారు.

కానీ అందరూ అసిచ్చినట్టు కాకుండా నరేష్ కి షాక్ లా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫ్లాప్ అయింది. ప్రేక్షకులు ఎంఎస్ రాజు (MSRaju) దర్శకత్వం వహించిన ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి రాలేదు. అంతే సుమారు రూ 15 కోట్ల వరకు ఖర్చు పెట్టి తీసిన సినిమా చూడటానికి ప్రేక్షకులు రాకపోయేసరికి తొందరగానే థియేటర్స్ నుండు ఏతేశారు.

Naresh-and-Pavitra.jpg

ఇప్పుడు ఈ సినిమా ఆహా (Aha) ఓటిటి #MalliPelliOnAHAలో స్ట్రీమింగ్ అవుతోంది, అలాగే అమెజాన్ ప్రైమ్ #AmazonPrime లో కూడా స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ నరేష్ మూడో భార్య ఈ రెండు చానెల్స్ కి లీగల్ నోటీసు లు ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. లీగల్ వ్యవహారాలు ఎందుకు, సినిమా స్ట్రీమింగ్ ఆపేస్తే మంచిది అని అమెజాన్ ఆపేసింది అని ఒక వార్త కూడా నడుస్తోంది. ఏమైనా ఈ 'మళ్ళీ పెళ్లి' #MalliPelli ఇలా వివాదాల్లో ఉండటం, దానితో పాటు నరేష్ పవిత్రలు కూడా వార్తల్లో ఉండటం పరిపాటి అయిపొయింది అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.

Updated Date - 2023-06-23T18:35:13+05:30 IST