Veera Simha Reddy OTT Streaming Date: ఓటీటీలోకి రానున్న బాలకృష్ణ సినిమా.. ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-02-01T11:53:38+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు.

Veera Simha Reddy OTT Streaming Date: ఓటీటీలోకి రానున్న బాలకృష్ణ సినిమా.. ఎప్పుడంటే..
Veera Simha Reddy

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ‘క్రాక్’ ఫేమ్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ ‌టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఓటీటీ (OTT) విడుదల కోసం ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

veerasimha.jpg

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. దీని కోసం ఈ చిత్ర నిర్మాతలకి భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్ హాట్‌స్టార్ యాజమాన్యం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-01T11:53:39+05:30 IST