OTT: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ల‌ర్స్‌.. వీటిని అస్స‌లు మిస్స‌వ‌కండి

ABN , First Publish Date - 2023-11-16T18:48:45+05:30 IST

ప్ర‌తివారం ఓటీటీలోకి సినిమాలు వ‌స్తుంటాయి, పోతుంటాయి కానీ ఎవ‌రికీ ఏది చూడాలి ఎక్క‌డ చూడాల‌నే డౌట్స్ ఉంటాయి. మ‌రికొంత‌మందికి తొంద‌రేముందిలే త‌ర్వాత ఎప్పుడైనా చుద్దాంలే అంటూ మ‌రిచిపోతుంటారు. కానీ ఈ వారం ఓటీటీలో ఎన్న‌డూ లేని వ‌ధంగా అదిరిపోయే యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి న‌వంబ‌న్ 17న ఓటీటీలోకి వ‌స్తున్నాయి. ఈ చిత్రాలు నాలుగు భాష‌ల నుంచి వ‌చ్చిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. వీటిపై మీరూ ఓ లుక్కేసి త‌ప్ప‌క‌చూడండి.

OTT: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ల‌ర్స్‌.. వీటిని అస్స‌లు మిస్స‌వ‌కండి
ott nov17

ప్ర‌తివారం ఓటీటీలోకి సినిమాలు వ‌స్తుంటాయి, పోతుంటాయి కానీ ఎవ‌రికీ ఏది చూడాలి ఎక్క‌డ చూడాల‌నే డౌట్స్ ఉంటాయి. మ‌రికొంత‌మందికి తొంద‌రేముందిలే త‌ర్వాత ఎప్పుడైనా చుద్దాంలే అంటూ మ‌రిచిపోతుంటారు. కానీ ఈ వారం ఓటీటీలో ఎన్న‌డూలేని వ‌ధంగా అదిరిపోయే యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి న‌వంబ‌న్ 17న ఓటీటీలోకి వ‌స్తున్నాయి. ఈ చిత్రాలు నాలుగు భాష‌ల నుంచి వ‌చ్చిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. వాటిపై మీరూ ఓ లుక్కేసి త‌ప్ప‌క‌చూడండి.

ప్ర‌ధానంగా మ‌మ్ముట్టి హీరోగా క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన క‌న్నూర్‌ స్కౌడ్ కేరళ‌లో ఘ‌న విజ‌యం సాధించి రికార్డులు తిర‌గ‌రాసింది. ఈ యేడు హయ్యెస్ట్ గ్రాస్‌డ్ మూవీల్లో ఒక‌టిగా నిలిచింది. ఓ వ్యాప‌ర‌వేత్త మ‌ర్డ‌ర్ కేసును న‌లుగురితో టీమ్‌గా ఉన్న మ‌మ్ముట్టి ఎలా ఛేదించాడు, ఎలాంటి స‌వాళ్లు ఎద‌ర్కొన్నాడ‌నే క‌థ‌లో నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించిన ఈ సినిమా చివ‌రి వ‌ర‌కు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం 17 నుంచి డిస్నీ ఫ్ల‌స్‌ హ‌ట్‌స్టార్‌లో రానుంది.

kannur.jpg

ఇక ఆ ఆర్వాత సిద్ధార్థ్ హీరోగా న‌టిస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ చిన్నా(Chinna). ద‌స‌రా స‌మ‌యంలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల నుంచి కూడా మంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాలో త‌న అన్న బిడ్డ‌తో క‌లిసి హీరో అన్యోన్యంగా ఉంటున్న స‌మ‌యంలో అ అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రం కూడా హ‌ట్‌స్టార్‌లో శుక్ర‌వారం (న‌వంబ‌ర్ 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

chinna.jpg


అదేవిధంగా ఇదే కోవ‌లో వ‌స్తున్న మ‌రో చిత్రం ఘోష్ట్ (Ghost). యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా క‌న్న‌డ‌ స్టార్ శివ‌రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన‌ ఈ చిత్రం న‌వంబ‌ర్‌4న తెలుగులో విడుద‌లైంది. గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాగా వ‌చ్చిన ఈ సినిమాలో ఆధ్యంతం హీరో ఎలివేష‌న్స్‌, యాక్ష‌న్ సీన్ల‌తో ఐఫీస్ట్‌లా చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 17 నుంచి జీ5 (ZEE5)లో ప్ర‌సారం కానుంది.

F-4Y6bsbYAA5cyD.jpg

ఇక నెట్‌ఫ్లిక్స్‌(netflix)లో వ‌స్తున్న ఓ ఆస‌క్తిక‌ర‌మైన ఇంటెన్సివ్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ది రైల్వేమెన్. 1984లో భూపాల్‌లోగ్యాస్ లీక్ జ‌రిగిన‌ స‌మ‌యంలో అక్క‌డ‌ చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు న‌లుగురు రైల్వే సిబ్బంది చేసిన పోరాటం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. మాధ‌వ‌న్, కేకే మీన‌న్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్ (న‌వంబ‌ర్ 18) శ‌నివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.

F_Dqd0VbYAAOSCQ.jpg

ఇక చివ‌ర‌గా చెప్పుకోవాల్సిన సినిమా లియో. లోకేశ్‌క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఆడ్వెంచ‌ర్ సినిమాగా వ‌చ్చిన లియో(Leo) ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లై రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. న‌వంబ‌ర్ 19 ఆదివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారం అయ్యే అవ‌కాశం ఉంది.

LEO.jpg

అయితే ఇక్క‌డ చెప్పిన ఐదింటిలో క‌న్న‌డ నుంచి ఘోష్ట్‌, త‌మిళం నుంచి లియో, చిన్నా మ‌ళ‌యాళం క‌న్నూరు స్కౌడ్‌, హిందీ నుంచి ది రైల్వేమెన్ నుంచి ఉండ‌డం విశేషం. ఇవ‌న్నీ మ‌న‌కు తెలుగులోనే ఉండ‌నున్నాయి.

Updated Date - 2023-11-16T18:56:23+05:30 IST