OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-01-29T09:43:07+05:30 IST

ఇటీవల ఓటీటీలా హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కొత్తరకంగా కంటెంట్‌తో దూసుకొస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

ఇటీవల ఓటీటీలా హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కొత్తరకంగా కంటెంట్‌తో దూసుకొస్తూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నాయి. కాగా జనవరి 28న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

ది ఇన్విటేషన్ (The Invitation)

తన తల్లి మరణం తరువాత తనకి తెలియని తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఓ యువతి అనుకుంటుంది. ఈ తరుణంలో ఆ యువతికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం ‘ది ఇన్విటేషన్’. జెస్సికా ఎం థాంప్సన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి బ్లెయిర్ బట్లర్ కథ అందించాడు. ఈ చిత్రంలో నథాలీ ఇమ్మాన్యుయేల్, థామస్ డోహెర్టీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

invitation.jpg

బ్లాక్ సైట్ (Black Site)

బ్లాక్ సైట్ అనేది 2022లో విడుదలైన ఆస్ట్రేలియన్-అమెరికన్ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం. జిందర్ హో కథ అందించిన ఈ చిత్రానికి సోఫియా బ్యాంక్స్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో జాసన్ క్లార్క్, మిచెల్ మోనాఘన్, జై కోర్ట్నీ నటించారు. సిటాడెల్‌లోని ఐదుగురు సీఐఏ అధికారులు బృందానికి ఓ తెలివైన దొంగ వల్ల సమస్యలు వస్తాయి. ఆ అధికారులు ఆ దొంగ ఆట ఎలా కట్టించారనే ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ బుక్‌ మై షోలో స్ట్రీమింగ్ అవుతోంది.

black.jpg

అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Meet Me In The Bathroom - ఇంగ్లిష్

బుక్ మై షో (Book My Show)

My Terrorized Teen - ఇంగ్లిష్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Love All Play - హిందీ, కొరియన్

Updated Date - 2023-01-29T09:43:20+05:30 IST