OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-02-22T08:09:02+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఫిబ్రవరి 21న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

సాల్వటోర్: షూమేకర్ ఆఫ్ డ్రీమ్స్ (Salvatore: Shoemaker of Dreams)

సాల్వటోర్: షూమేకర్ ఆఫ్ డ్రీమ్స్ అనేది లూకా గ్వాడాగ్నినో దర్శకత్వం వహించిన 2020 ఇటాలియన్-ఆంగ్ల డాక్యుమెంటరీ చిత్రం. ఇది సాల్వటోర్ ఫెర్రాగామో జీవితం గురించి వివరిస్తుంది. నవంబర్ 4, 2022న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలై మంచి రివ్యూలు అందుకుంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

salvator.jpg

కాథ్లీన్ మాదిగన్: హంటింగ్ బిగ్‌ఫుట్‌ (Kathleen Madigan: Hunting Bigfoot)

కాథ్లీన్ మాదిగన్ దాదాపు 20 సంవత్సరాలకు పైగా స్టాండ్-అప్ షోలు చేస్తూ మంచి పాపులారిటీ సాధించింది. HBOలో ప్రత్యేకంగా ఓ షోనే హోస్ట్ చేస్తోంది. అలాగే సొంతంగా పాడ్‌కాస్ట్ కూడా చేస్తోంది. ఆమె తన తాజా స్పెషల్ స్టాండప్ షో కాథ్లీన్ మాడిగన్: హంటింగ్ బిగ్‌ఫుట్‌తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. ఈ షోలో వయసైన తల్లిదండ్రులు వంటి పలు ఆసక్తికర విషయాలపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరింది. ఈ స్టాండప్ షో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

kathleen.jpg

యూట్యూబ్ (YouTube)

SK Sir Ki Class - హిందీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

Sulochana - హిందీ

Madhuri - హిందీ

Updated Date - 2023-02-22T08:09:07+05:30 IST