Puli-Meka Teaser: ఆ మృగం లాంటి మనిషి టార్గెట్ పోలీసులే.. ఎందుకలా?

ABN , First Publish Date - 2023-02-17T20:11:05+05:30 IST

సాధార‌ణంగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారు. మ‌రి అలాంటి రక్షకులనే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే వారేం చేస్తారు? భ‌యంక‌ర‌మైన ప‌నులు చేసే వ్య‌క్తిని మృగం..

Puli-Meka Teaser: ఆ మృగం లాంటి మనిషి టార్గెట్ పోలీసులే.. ఎందుకలా?
Puli Meka Web Series Still

సాధార‌ణంగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారు. మ‌రి అలాంటి రక్షకులనే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే వారేం చేస్తారు? భ‌యంక‌ర‌మైన ప‌నులు చేసే వ్య‌క్తిని మృగం అంటుంటాం. మృగంలాంటి వేషంతో ఓ వ్య‌క్తి వరసబెట్టి పోలీసులను చంపేస్తూ.. సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌ను చేస్తుంటాడు. అత‌ని టార్గెట్ సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం కానే కాదు.. ఏకంగా పోలీసులే. త‌మ డిపార్ట్‌మెంట్ (Police Department) అధికారుల‌ను ఎవ‌రో ఓ వ్య‌క్తి వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటే పోలీసులు ఏం చేశారు? ఇది తెలియాలంటే జీ5 ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 24న స్ట్రీమింగ్ కాబోతున్న‌ ‘పులి మేక’ (Puli Meka) ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ చూడాల్సిందే. జీ 5లో స్ట్రీమింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్న ఈ స‌స్పెన్స్ థ్రిల్లింగ్‌ ఒరిజిన‌ల్ టీజ‌ర్‌ను శుక్ర‌వారం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Mega Power Star Ram Charan) రిలీజ్ చేసి టీమ్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సిరీస్‌ను కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ (Kona Film Corporation)తో కలిసి జీ5 (Zee5) నిర్మించింది. లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), ఆది సాయికుమార్‌ (Aadi Saikumar), సుమన్ (Suman), సిరి హ‌న్మంత్ (Siri Hanmanth) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

‘పులి మేక’ టీజ‌ర్‌ (Puli-Meka Teaser) విషయానికి వస్తే .. పోలీసుల‌ను మృగంలాంటి వేష‌ధార‌ణ‌తో ఉన్న వ్య‌క్తి వ‌రుసగా చంపేస్తుంటాడు. అస‌లు ఈ హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేస్తున్నార‌నేది తెలియ‌క డిపార్ట్‌మెంట్ త‌ల‌ ప‌ట్టుకుంటుంది. వెంట‌నే కేసుని సాల్వ్ చేయ‌టానికి, హంత‌కుడిని ప‌ట్టుకోవ‌టానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ను ఏర్పాటు చేయగా.. దానికి హెడ్ కిర‌ణ్ ప్ర‌భ (లావ‌ణ్య త్రిపాఠి). అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబ‌ర్ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ (ఆది సాయికుమార్) క‌నిపిస్తున్నారు. కేసుని సాల్వ్ చేయ‌టానికి పోలీసులు క‌ష్ట‌ప‌డుతుంటే మ‌రో వైపు మీడియా, పై అధికారుల నుంచి వారిపై ఒత్తిడి ఉంటుంది. ఈ స‌న్నివేశాల‌ను చాలా ఆసక్తికరంగా టీజ‌ర్‌లో చూపించారు. అస‌లు ఆ హంత‌కుడు ఎవ‌రు? ఎందుక‌లా పోలీసుల‌ను టార్గెట్ చేశాడనేదే ఈ పులి మేక వెబ్‌ సిరీస్ స్టోరీ. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతోంది. (Puli-Meka Teaser Talk)

Updated Date - 2023-02-17T20:11:08+05:30 IST