Mamannan OTT: వడివేలు అద్భుతంగా నటించిన 'మామన్నన్' ఇక ఓటిటిలో చూసుకోవచ్చు, ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-07-18T16:51:35+05:30 IST

ఉదయనిధి స్థాలిన్, కీర్తి సురేష్, వడివేలు, ఫహాద్ ఫాజిల్ నటించిన 'మామన్నన్' తమిళంలో పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో 'నాయకుడు' పేరిట విడుదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని నాలుగు భాషల్లో ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

Mamannan OTT: వడివేలు అద్భుతంగా నటించిన 'మామన్నన్' ఇక ఓటిటిలో చూసుకోవచ్చు, ఎప్పుడంటే...
Maamannan is going to stream on OTT

తమిళ సినిమా పరిశ్రమలో టాప్ కమెడియన్ నటుల్లో వడివేలు (Vadivelu) ఒకరు, కొన్ని సంవత్సరాల పాటు తన కామెడీ తో తమిళ ప్రేక్షకులని అలరిస్తూనే వున్నారు వడివేలు. ఈమధ్య విడుదలైన తమిళ సినిమా 'మామన్నన్' #Maamannan లో వడివేలు ఒక సీరియస్ పాత్రలో కనిపించి అందరినీ తన నటనతో ఆశ్చర్యచకితులని చేశారు. ఇందులో ఉదయనిధి స్థాలిన్ (UdhayanidhiStalin,) కథానాయకుడిగా నటించగా, కీర్తి సురేష్ (KeerthySuresh) కథానాయికగా నటించింది. ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. ఇందులో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ (FahadhFaasil) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. దీనికి మారి సెల్వరాజ్ (MariSelvaraj) దర్శకుడు.

maamannan.jpg

జూన్ 29 న తమిళంలో విడుదలైన ఈ సినిమాని గత వారం తెలుగులో 'నాయకుడు' #Nayakudu పేరిట విడుదల చేశారు, కానీ సరైన ప్రచారాలు లేకపోవటంతో ఈ సినిమా అంతగా ఇక్కడ నడవలేదు. కానీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. వడివేలు కి అవార్డు కూడా వస్తుంది అని అంటున్నారు. ఇక ఈ సినిమా కథ రాజకీయ డ్రామా, యాక్షన్ మిళితమై ఉంటుంది. అలాగే ఈ సినిమాలో దళిత ఎంఎల్ఏగా వడివేలు నటనని అందరూ ప్రశంసించారు.

ఇప్పుడు ఈ సినిమాని డిజిటల్ లో MaamannanDigitalPremiere స్ట్రీమింగ్ చేస్తున్నామని ప్రకటించారు. మామన్నన్ సినిమా నెట్ ఫ్లిక్స్ (NetFlix) ఓటిటి ఛానల్ లో జులై 27 (July27) న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఆ ఛానల్ అధికారికంగా తన సాంఘీక మాధ్యమంలో ప్రకటించింది. ఇది తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది.

Updated Date - 2023-07-18T16:52:24+05:30 IST