OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-21T08:33:45+05:30 IST

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో జోరు తగ్గుతుందని.. థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో జోరు తగ్గుతుందని.. థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ థియేటర్లతో పోటీ పడుతూ ఓటీటీలు సైతం స్పెషల్‌ కంటెంట్‌తో దూసుకుపోతున్నాయి. చాలామంది థియేటర్‌లో రిలీజైన సినిమాలు ఓటీటీలోకి వచ్చేవరకు ఆగి.. ఇంటి వద్దే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో.. మార్చి 20న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

దారి యావుడయ్యా వైకుంఠకే (Daari Yavudayya Vaikuntake)

‘దారి యావుడయ్యా వైకుంఠకే’ అనేది కన్నడ కామెడీ చిత్రం. కష్టపడకుండా సుఖంగా జీవించడానికి ఓ వ్యక్తి దొంగతనాలు చేస్తుంటాడు. అలా దొంగతనం చేసే తరుణంలోనే అనుకోకుండా శ్మశానంలోని ఓ సమాధిలో పడిపోతాడు. రెండు రోజుల పాటు అక్కడే ఉండాల్సి వస్తుంది. అతను ఎలా బ్రతికి బయటపడ్డాడనేది ఈ చిత్ర కథాంశం.

గతేడాది మే 20న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సిద్దు పూర్ణచంద్ర దర్శకత్వం వహించగా.. వర్ధన్, అనూషా రోడ్రిగ్స్, బాల రాజ్‌వాడి, ప్రణయ మూర్తి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

daari.jpg

బహఘర.కామ్ (Bahaghara.com)

ఓ వ్యక్తి తన తల్లితో కలిసి ఓ ఊరిలో నివసిస్తూ ఉంటాడు. అయితే.. వయస్సు వచ్చిందని చెప్పి అతని తల్లి అతన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కానీ.. అది అతనికి ఇష్టం ఉండదు. పెళ్లి భారాన్ని అప్పుడే తీసుకోలేనని భావిస్తాడు. అందుకే తన గ్రామంలోని ఓ అమ్మాయిని ఒప్పించి ఆమెని ఓ సంవత్సరానికి కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంటాడు. అయితే అనంతరం వారిద్దరి మధ్య నిజంగానే ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘బహఘర.కామ్’ కథాంశం. రిషి, సాయల్, పుష్ప పాండ, ప్రద్యుమ్న లెంక కీలక పాత్రల్లో నటించారు. ఈ ఒడియా మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

bahaghara.jpg

సోనీ లివ్ (Sony LIV)

Lucky Hank - ఇంగ్లిష్

ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (MX player)

Miss Hammurabi - కొరియన్

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Gabby's Dollhouse Season 7 - ఇంగ్లిష్

క్లిక్ (KLIKK)

Junction Varanasi - బెంగాలీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

Mission Performance - హిందీ

మనోరమ మ్యాక్స్ (Manorama MAX)

The Next Top Anchor - మలయాళం

Updated Date - 2023-03-21T10:33:16+05:30 IST