OTT movies - webseries : తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2023-03-25T08:02:01+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT movies - webseries : తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

బలగం (Balagam)

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించిన మూవీలలో 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శిని, కావ్య ప్రధాన పాత్రలు పోషించగా.. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 3న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. సాయిలు అనే యువకుడికి చాలా అప్పులు ఉంటాయి. వాటిని తీర్చడానికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ తరుణంలోనే అతని తాతా కొమురయ్య చనిపోతాడు. కానీ ఆయన పిండాన్ని కాకి ముట్టదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

balagam.jpg

చోర్ నికల్ కే భాగ (Chor Nikal Ke Bhaga)

ఒక ఫ్లైట్ అటెండెంట్, ఆమె ప్రియుడు పాత అప్పును క్లియర్ చేయడానికి వజ్రాలని దొంగిలించాలి అనుకుంటారు. కానీ అనుకోకుండా ఆమె ప్రయాణిస్తున్న ప్లేన్ హైజాక్ అవుతుంది. దీంతో వాళ్ల ప్లాన్ మొత్తం చెడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది 'చోర్ నికల్ కే భాగ' చిత్ర కథాంశం. అజయ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

chor.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Who Were We Running From? - టర్కిష్

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Bakasuran - తమిళం

Crimes Aaj kal - హిందీ

Reggie - ఇంగ్లిష్

A Man Called Otto - ఇంగ్లిష్, స్పానిష్

Zee 5 (జీ 5)

Sengalam - తమిళం

Poovan - మలయాళం

De Dhakka 2 - మరాఠీ

Kanjoos Makhichoos - హిందీ

సోనీ లీవ్ (Sony LIV)

Purusha Pretham - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney plus Hotstar)

Boston Strangler - ఇంగ్లిష్

బుక్ మై షో (Book My Show)

Insight - ఇంగ్లిష్

Updated Date - 2023-03-25T08:02:03+05:30 IST