OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-16T09:43:13+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి జనవరి 15న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

వరలారు ముక్కియం (Varalaru Mukkiyam)

వరలారు ముక్కియం అనేది 2022లో విడుదలైన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. సంతోష్ రాజన్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి నిర్మించాడు. ఈ చిత్రంలో 'రంగం' ఫేమ్‌ జీవా, కాశ్మీరా పరదేశి, ప్రజ్ఞా నాగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించాడు. 9 డిసెంబర్ 2022న థియేటర్‌లలో విడుదలైన ఈ చిత్రానికి నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. ఈ తమిళ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

varalaru.jpg

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

I Did Not Kill My Girlfriend - హిందీ

You Have Arrived - హిందీ

Aarzoo - హిందీ

Virangana - హిందీ

Pyare Papa - హిందీ

Panch Din - హిందీ

Updated Date - 2023-01-16T09:43:39+05:30 IST