LGM in OTT : ధోనీ భార్య నిర్మించిన సినిమా ఇప్పుడు ఓటీటీలో...

ABN , First Publish Date - 2023-09-28T16:30:12+05:30 IST

క్రికెటర్‌ ధోనీ భార్య సాక్షి నిర్మించిన తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’. హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా ప్రధాన పాత్రల్లో లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది.

LGM in OTT : ధోనీ భార్య నిర్మించిన సినిమా ఇప్పుడు ఓటీటీలో...

క్రికెటర్‌ ధోనీ భార్య సాక్షి నిర్మించిన తొలి చిత్రం ‘ఎల్‌జీఎం’. హరీశ్‌ కల్యాణ్‌, ఇవానా ప్రధాన పాత్రల్లో లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా స్ర్టీమింగ్‌ అవుతోంది. రమేష్‌ తమిళ్‌ మణి దర్శకత్వం వహించగా నటి నదియా ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించారు.

కథ: గౌతమ్‌ (హరీష్‌ కళ్యాణ్‌), మీరా (ఇవానా) ఒకే సంస్థలో పని చేస్తూ రెండేళపాటు డేటింగ్‌లో ఉంటారు. ఆ తర్వాత గౌతమ్‌ పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో మీరా ఓకే చెబుతుంది. తీరా ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకునే సమయంలో మీరా ఓ షరతు పెడుతుంది. పెళ్లయిన తర్వాత అత్తతో సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ముందే ఆమెతో కలిసి కొన్ని రోజు?ని గడపాలని కోరుకుంటుంది. అందుకోసం ఓ టూర్‌ ప్లాన్‌ చేస్తుంది. ఈ వింత ప్రతిపాదనకు గౌతమ్‌ అంగీకరించి ఆఫీస్‌ ట్రిప్‌ అని అబద్థం చెప్పి తన తల్లిని ఒప్పిస్తాడు. అలా అందరూ కలిసి కూర్గ్‌కి బయల్దేరతారు. అక్కడ ఏం జరిగింది. గౌతమ్‌ తల్లితో మీరా కలిసిపోయిందా? గౌతమ్‌తో మీరా పెళ్లికి ఒప్పుకొందా? అన్న మిగతా కథ.

Updated Date - 2023-09-28T16:30:12+05:30 IST