Ghost: ఓటీటీలోకి.. హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘ఘోష్ట్’

ABN , First Publish Date - 2023-11-13T15:44:18+05:30 IST

ఈ వారం మ‌రో పెద్ద సినిమా ఓటీటీలోకి రానుంది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్‌కుమార్ న‌టించిన ‘ఘోష్ట్’ న‌వంబ‌ర్ 17 నుండి జీ5లో స్ట్రీమింగ్ సిద్ధం అయింది.

Ghost: ఓటీటీలోకి.. హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘ఘోష్ట్’
ghost

ఈ వారం మ‌రో పెద్ద సినిమా ఓటీటీలోకి రానుంది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్‌కుమార్ (Shivaraj kumar) న‌టించిన ‘ఘోష్ట్’(Ghost) అనే సినిమా న‌వంబ‌ర్ 17 నుండి జీ5 (ZEE5) యాప్‌లో స్ట్రీమింగ్ సిద్ధం అయింది. ఎమ్‌జీ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనీ సినిమాటిక్ యూనివ‌ర్స్‌ ((SCU)లో మొద‌టి చిత్రంగా ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా ఆక్టోబ‌ర్‌19 క‌న్న‌డ నాట విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. న‌వంబ‌ర్ 4న‌ తెలుగులో విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌ను రాబ‌ట్టింది.

ఇప్ప‌టికే జైల‌ర్ సినిమాలో అద్భుత‌మైన పాత్ర‌లో రెండు సార్లు కనిపించి మెస్మ‌రైజ్ చేసి సినిమాకే హైలెట్‌గా నిలిచిన శివ‌రాజ్ కుమార్‌ దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో వచ్చిన ‘ఘోష్ట్’ సినిమాలో భారీ యాక్షన్ తో మరోమారు అభిమానులకు కనులవిందు చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.

ఎమ్‌జీ శ్రీనివాస్ 2019లో క‌న్న‌డ‌లో త‌నే హీరోగా, ద‌ర్శ‌కుడిగా రూపొందించిన‌ బీర్బ‌ల్ అనే సినిమా ద్వారా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ఊహించిన దాని క‌న్నా మంచి విజ‌యం సాధించడంతో ప‌లువురు బాలీవుడ్ నిర్మాత‌లు ఈ సినిమా రైట్స్ తీసుకోగా, దీనినే 2021లో తెలుగులో స‌త్య‌దేవ్ హీరోగా తిమ్మ‌రుసుగా తెర‌కెక్కించ‌గా ఇక్క‌డా మంచి విజ‌యాన్ని సాధించింది.


త‌న రెండో ప్ర‌య‌త్నంగా ద‌ర్శ‌కుడు శివ‌రాజ్ కుమార్(Shivanna) హీరోగా అనుప‌మ్‌ఖేర్‌, జ‌య‌రాం వంటి భారీ తారాగ‌ణంతో ఈ ‘ఘోష్ట్’ చిత్రాన్ని తీయ‌గా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి హిట్ సాధించింది. అయితే తెలుగులో విడుదలైన 12 రోజులకే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి వ‌చ్చేస్తుంది. న‌వంబ‌ర్ 17 నుంచి ప్ర‌ముఖ ఫ్లాట్‌ఫాం జీ5 (ZEE5)లో స్రీమింగ్ కానుంది. మంచి హై ఓల్టేజీ య‌క్ష‌న్ డ్రామా కోరుకునే వారికి ఈ సినిమా మంచి ఐ ఫీస్ట్ వంటిది. సో డోంట్ మిస్ ఇట్‌.

Updated Date - 2023-11-13T17:37:29+05:30 IST