OTT: జిగ‌ర్ తండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టినుంచంటే

ABN , First Publish Date - 2023-11-21T15:01:06+05:30 IST

దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జిగ‌ర్ తండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ లాక్ చేసుకుంది. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించగా కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు.

OTT: జిగ‌ర్ తండ 2 ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టినుంచంటే
JIGAR THANDA

దీపావ‌ళికి ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన జిగ‌ర్ తండ 2 (Jigarthanda DoubleX) డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ (NETFLIX) లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ జరుగనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో లారెన్స్ (Raghava Lawrence) హీరోగా, ఎస్జే సూర్య(SJ Suryah) ప్రధాన పాత్రలో నటించగా కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం వహించారు.

jigarthanda.jpg

న‌వంబ‌ర్‌10న కార్తీ జ‌పాన్‌కు పోటీగా త‌మిళ‌, తెలుగు,ర‌న్న‌డ భాష‌ల్లో విడుద‌లైన ఈ జిగ‌ర్తండ‌2 మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతూ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. జ‌పాన్ ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌ర్చ‌డం ఈ సినిమాకు బాగా క‌లిసి రావ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్‌(Karthik Subbaraj) తీసుకున్న ఢిప‌రెంట్ థీమ్ సినిమాను మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. సినిమా చూసిన వారంతా ఇది ఓ మాస్ట‌ర్‌పీస్‌గా కొనియాడుతున్నారు.


జిగ‌ర్ తండ 2 (Jigarthanda DoubleX) సినిమా నాలుగైదు భాష‌ల్లో విడుద‌లైన‌ప్ప‌టికీ కేవ‌లం త‌మిళ‌నాట మాత్ర‌మే అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌తో మోత మోగిస్తున్న‌ది. దేశవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.50కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే మేక‌ర్స్‌ నెట్‌ఫ్లిక్స్‌తో ముంద‌స్తుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం సినిమాను డిసెంబ‌ర్ 8నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (NETFLIX) స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు సోష‌ల్‌ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Updated Date - 2023-11-21T15:42:07+05:30 IST