OTT: ఓటీటీలోకి రాబోతోన్న ‘జెట్టి’.. ఎందులో అంటే

ABN , First Publish Date - 2023-11-16T16:43:41+05:30 IST

ఈ వారం ఓటీటీలోకి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం రానుంది. మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘జెట్టి’ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని వర్ధిన్ ప్రొడక్షన్స్ మీద కే.వేణు మాధవ్ నిర్మించగా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక తెరకెక్కించారు.

OTT: ఓటీటీలోకి రాబోతోన్న ‘జెట్టి’.. ఎందులో అంటే
jetti

ఈ వారం ఓటీటీలోకి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రం రానుంది. మత్స్యకారుల జీవన విధానాన్ని చూపిస్తూ తెరకెక్కించిన ‘జెట్టి’(Jetti) చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మానినేని కృష్ణ, నందితా శ్వేత కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని వర్ధిన్ ప్రొడక్షన్స్ మీద కే.వేణు మాధవ్ నిర్మించగా.. సుబ్రహ్మణ్యం పిచ్చుక తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ వంటి వారు రావడంతో చాలానే బజ్ క్రియేట్ చేసింది. అలాంటి ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానంపై తీసిన ఈ ‘జెట్టి’ చిత్రం సహజత్వానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతీ పాత్ర ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉంటుంది. మొదటి సినిమానే అయినా కూడా యాక్షన్ సీక్వెన్స్‌లో హీరో మానినేని కృష్ణ అదరగొట్టేశాడు.


ఇక ఈ మూవీలోని పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. చంద్రబోస్, శ్రీమణి, కాసర్ల శ్యామ్ వంటి మహామహులు పాటలు రచించారు. సిధ్ శ్రీరామ్, శంకర్ మహదేవన్, మంగ్లీ, అనురాగ్ కులకర్ణి, విజయ్ యేసుదాస్, సునిత పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా సిధ్ శ్రీరామ్ పాడిన పాట యూట్యూబ్‌లో 22 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది.

సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. చివరి 20 నిమిషాలు ఉద్వేగభరితంగా ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్‌కు ప్రతీ ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. డైలాగ్ రైటర్ శశిధర్ వేమూరి ఎంతో లోతైన, భావోద్వేగమైన సంభాషణలు అందించారు. అలాంటి ఈ చిత్రానికి థియేటర్లో మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధ‌మైంది. ఈ చిత్రం నవంబర్ 16 రాత్రి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - 2023-11-16T16:43:43+05:30 IST