OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన రెండు భారీ సినిమాలు.. ఫ్యాన్స్‌కు పండ‌గే

ABN , First Publish Date - 2023-11-02T13:42:41+05:30 IST

ఈవారం సినీ అభిమానుల‌కు మంచి వినోదం అంద‌నుంది. గురువారం రెండు భారీ యాక్ష‌న్‌ సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేశాయి. షారుఖ్ ఖాన్ న‌టించిన జ‌వాన్ నెట్‌ఫ్లిక్స్‌లో, రామ్ న‌టించిన స్కంద డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌ల‌లో బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన రెండు భారీ సినిమాలు.. ఫ్యాన్స్‌కు పండ‌గే
JAWAN , SKANDA

ఈవారం సినీ అభిమానుల‌కు మంచి వినోదం అంద‌నుంది. గురువారం రెండు భారీ యాక్ష‌న్‌ సినిమాలు ఓటీటీలోకి వ‌చ్చేశాయి. షారుఖ్ ఖాన్ న‌టించిన జ‌వాన్(jawan) నెట్‌ఫ్లిక్స్‌లో, రామ్ న‌టించిన స్కంద(skanda ) డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌(hotstar )ల‌లో బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేట‌ర్ల‌లో ఈ సినిమాల‌ను మిస్స‌యిన వారు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించ‌వ‌చ్చు.

srikjawan.jpg

జ‌వాన్ సినిమాకు త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీ ద్శ‌క‌త్వం మ‌హించ‌గా విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకుణే వంటి వారు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. సెప్టెంబ‌ర్‌7న విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 1140 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి రికార్డులు సృష్టించ‌గా సౌత్ ఇండ‌స్ట్రీ టాలెంట్‌ను బాలీవుడ్‌కు రుచి చూయించింది. న‌వంబ‌ర్‌2 షారుఖ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఒక‌టో తేదీ అర్ధ‌రాత్రి నుంచే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌(netflix)లో థియేట‌ర్‌లో వ‌చ్చిన నిడివితో కాకుండా ఎక్స్‌టెండెడ్ వెర్ష‌న‌తో విడుద‌ల చేశారు.


Skanda.jpg

ఇక రామ్ పోతినేని , బోయ‌పాటి కాంబినేష‌న్‌లో శ్రీలీల ,సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 28న విడుద‌లైన స్కంద (skanda) మొద‌టిరోజే మిశ్ర‌మ స్పంద‌న రావ‌డంతో అభిమానులు సినిమాపై ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌లేదు. మితీమీరిన హింసా దృశ్యాలు, లాజిక్‌ లేని ఫైట్స్‌, అర్థం కానీ పాట‌ల రొద‌తో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చింది. మ‌రి ఇప్పుడైనా ఓటీటీలో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటుందేమో చూడాలి.

Updated Date - 2023-11-02T13:44:58+05:30 IST